రూ.64 లక్షలతో రహదారి పనులు
హొసపేటె: తిమ్మలపూర్ గ్రామంలో రూ.64.33 లక్షలతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులను విజయనగర జిల్లా హగరి బొమ్మనహళ్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కె.నేమరాజ్ నాయక్ భూమి పూజ చేసి ప్రారంభించారు. మరియమ్మనహళ్లి సమీపంలోని తిమ్మలపూర్‌లో ఈ సందర్భంగా చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిమ్మలపూర్ చారిత్రాత్మక ప్రదేశం అని, భక్తులు, పర్యాటకుల ప్రయాణం సజావుగా సాగడానికి వేణుగోపాలస్వామి ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. జిల్లా ఖనిజ నిధి డీఎంఎఫ్ ప్రాజెక్టు కింద కేటాయంచిన నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రైతులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పి.ఓబప్ప, బీఎస్.రాజప్ప, పోతలకట్టె నాగరాజ, కృష్ణప్ప, మల్లికార్జున, గోనెప్ప, మంజునాథ్, వెంకటేశప్ప, పరుశరామ, తదితరులు పాల్గొన్నారు.


