ప్రతిభను వెలికితీసేందుకే పోటీలు
కోలారు: పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రతిభా కారంజీ పోటీలు చక్కటి వేదికలని గ్రామ పంచాయతీ అధ్యక్షుడు కుమార్ అన్నారు. తాలూకాలోని నరసాపురం గ్రామంలో కేపీఎన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన క్లస్టర్ స్థాయి ప్రతిభా కారంజీ పోటీల్లో విజేత విద్యార్థులకు ఆయన బహుమతులను అందించి మాట్లాడారు. బహుమతులు రానివారు నిరుత్సాహ పడరాదని, పోటీలలో పాల్గొనడమే ముఖ్యమన్నారు. పాఠశాల అభివృధ్ది సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మంజుల, హెచ్‌ఎం గోపినాథ్, మల్లికార్జున, శ్రీనివాస్ పాల్గొన్నారు.


