విద్యార్థులు సహకరించాలి
రాయచూరురూరల్: నేటి ఆధునిక యుగంలో నేరాల నియంత్రణకు విద్యార్థులు సహకరించాలని జిల్లా పంచాయితీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈశ్వర్ కుమార కాందూ పిలుపునిచ్చారు. జన జాగృతి కార్యక్రమంలో భాగంగా నగరంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ప్రిన్సిపల్‌కు అవగాహన కల్పించారు. ఈశ్వర్‌కుమార్ కాందూ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఅర్‌ఎస్ 112, 1930 సహాయవాణిపై వివరించారు. సాంకేతిక రంగంలో మార్పులు వచ్చినా.. నేరాలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ గజానన, ఎస్పీ పుట్టమాదయ్య, రిమ్స్ డైరెక్టర్ రమేష్, వ్యవసాయ కళాశాల అధికారి కురుబర్, పరమవీర్, మహదేవప్ప పాల్గొన్నారు.


