నైతిక విలువలు నశించాయి
రాయచూరురూరల్: సమాజంలో నైతిక విలువలు నశించిపోతున్నాయని సీనియర్ పాత్రికేయుడు శరణప్ప అన్నారు. కోప్పళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజలకు నైతిక విలువలు తెలియజేయడానికి విద్యార్థులు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వైబి.అంగడి, ప్రకాష్ గౌడ, నరసింహ, సుదా, యమనూరప్ప, బసవ రాజప్ప, విజయలక్ష్మి, సంతోష్‌కుమారి, వసంత్, అభిషేఖ్ పాల్గొన్నారు.
జొన్న పంటకు నష్టం
రాయచూరురూరల్: అకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నా.. వర్షాలు కురవడం లేదు. కష్టపడి పండించుకున్న పంటలు కళ్లెదుటే ఎండుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కర్నాటక ప్రాంతంలోని రాయచూరు జిల్లాలోని మూడు లక్షల ఎకరాల్లో జొన్న, 1.5 లక్షల ఎకరాల్లో పత్తి, 86 వేల ఎకరాల్లో మిరప పంట రైతులు సాగు చేశారు. చెంతనే నదులున్నా.. పొలాలకు నీరందించుకోలేని పరిస్థితి. దీనికితోడు నదిలో నీరు లేక బోర్లలో నీరు అడుగంటింది. మరో వైపు విద్యుత్తు కోతలు రైతులను వేధిస్తున్నాయి. ఇవన్నీ వెరసి జొన్న, పత్తి, మిరప పంటలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొంతమేర ఎండుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వాటికి నీరందించే దిశగా పాలకులు ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు చేపట్టకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఎస్పీ కార్యాలయం
ఎదుట ఆందోళన
రాయచూరురూరల్: కులం పేరుతో దూషించిన వారిని అరెస్టు చేయాలని దళిత సంఘర్షణ సమితి సమన్వయ సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. రాయచూరు ఎస్పీ కార్యాలయం వద్ద శుక్రవారం చేపట్టిన అందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శ్రీరంగపట్నంలో జరిగిన సభలో మైనార్టీ మహిళను అసభ్య పద జాలంతో దూషించిన వ్యక్తిని రక్షించడం తగదన్నారు. వెనుక బడిన వర్గాల వర్గీకరణ విషయంలో కాంత్‌రాజ్ నివేదికను రాష్ట్ర సర్కారు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అనంతరం స్థానిక అధికారికి వినతిపత్రం సమర్పించారు.
బాధ్యతల స్వీకరణ
బళ్లారి అర్బన్: బళ్లారి పాలికె ఆరోగ్య స్థాయి సమితి నూతన అధ్యక్షుడిగా పేరం వివేక్, రెవెన్యూ కమిటీ అధ్యక్షుడిగా కుబేర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక పాలికె కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పాలికె పరిధిలో సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషిచేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రణాళికా బద్ధంగా చేపట్టనున్న కార్యక్రమాలను వారు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, ప్రముఖులు అల్లం ప్రశాంత్, రాజేశ్వరి, అసిమ్, గోవిందరాజు, హనుమంతప్ప, గుడిగంటి హనుమంత, హర్షద్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుక
సాక్షి,బళ్లారి: కురుగోడు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నారా సూర్యనారాయణరెడ్డి జన్మదిన వేడుక శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 72వ జన్మదినోత్సవం సందర్భంగా నగరంలో పెద్దఎత్తున బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. నారా సూర్యనారాయణరెడ్డి తన కుమారుడు నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు. కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకలు
హుబ్లీ: క్రిస్మస్ నేపథ్యంలో జిల్లాలోని ప్రతి మందిరంలోనూ వేడుకలు నిర్వహిస్తారని రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్ పర్సన్ సువర్ణ తెలిపారు. వేడుక నిర్వహణ వేళ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలు కాపాడాలని కోరుతూ పోలీసులకు ఆమె వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఆలయం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా భద్రత కల్పించాలని కోరారు.
నైతిక విలువలు నశించాయి
నైతిక విలువలు నశించాయి
నైతిక విలువలు నశించాయి


