వ్యవసాయంపై రైతుల నిరాసక్తి
మండ్య: భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం అని, అయినా కూడా ఇటీవల కాలంలో సుమారు 20 శాతం మందికి పైగా వ్యవసాయంపై ఆసక్తిని చూపడం లేదని, గతంలో సుమారు 80 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంలో రాణించేవారని, కాని నేడు సుమారు 60 శాతం మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మండ్య తాలూకాలోని వీసీ ఫారంలో మూడు రోజుల పాటు జరిగే వ్యవసాయ మేళాను ప్రారంభించిన ఆయన ఆక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన అనంతరం కార్యక్రమంలో మాట్లాడారు. వ్యవసాయంలో లాభాలు రావడం లేదనే భావన చాలా ఉందన్నారు. దానిని అర్థం చేసుకున్న వారు అనేక మంది వ్యవసాయరంగంలో రాణిస్తున్నారన్నారు. అందువల్ల యువకులు సైతం వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాలన్నారు. 60వ దశకంలో తాను ఊరికి వెళ్లినప్పుడు అక్కడ ఊళ్లో తాను కూడా వ్యవసాయం చేశానని గుర్తు చేసుకున్నారు. కాని అప్పుడు ఎలాంటి టెక్నాలజీ ఆందుబాటులో లేదని అన్నారు. కాని ప్రస్తుతం వ్యవసాయ రంగంలో టెక్నాలజీ అందుబాటులో ఉందని అన్నారు. రైతులు, వ్యవసాయ నిఫుణులు కూడా ఏకకాలంలో ఒకే పంటను సాగు చేయకుండా ఇతర రకాల పంటలను సాగు చేయడం ద్వారా లాభాలు సాధించాలని అన్నారు.
ఫిలిప్ఫైౖన్స్ లాంటి పరిశోధన చాలా అవసరం
ఫిలిప్‌పైన్స్ లాంటి చిన్న దేశంలో వ్యవసాయ రంగంలో ఆక్కడి రైతులు మంచి లాభాలు సాధిస్తున్నారన్నారు. ఒకే మొక్కలో ఆరు వివిధ రకాల పంటలను సాగు చేసే పద్ధతిపై పరిశోధన సాగుతోందన్నారు. వీసీ ఫారం వ్యవసాయ వర్సిటీలో కూడా టమాటా, వంకాయ పంటలను సాగు చేస్తున్నారన్నారు. ఇది చాలా మంది అభివృద్ధి ఆని అన్నారు. ఇలాంటి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం అని అన్నారు. వివిధ రకాల జాతులకు చెందిన వంగడాలపై పరిశోధన అవసరమని అన్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
అంతర్జాతీయ స్యాండ్‌విచ్ పీజీ ప్రారంభానికి చర్యలు
మైసూరులో వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి ఆంతర్జాతీయ స్యాండ్‌విచ్ స్నాతకోత్సవ డిగ్రీ కోర్సుని ప్రారంభించడానికి చాలా తీవ్రంగా సమాలోచనలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మండ్య జిల్లాలో రైతు పోరాటదారుడుగా పేరొందిన రైతు నాయకుడు కే.ఎస్.పుట్టణ్ణయ్య చేసిన సేవలకు వెలకట్టలేమన్నారు. వ్యవసాయంపై అంతటి ఆసక్తిని పెంచుకున్న పుట్టణ్ణయ్య పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ దిశలో తగిన చర్యలకు ప్రత్యేక అధికారికి కూడా సూచించినట్లు తెలిపారు.


