● ఔరా.. ఇది బెంగళూరా?
బొమ్మనహళ్లి: బెంగళూరు నగరంలో కనీసం బైకును వేసుకొచ్చినా ఇబ్బందులు తప్పవనేందుకు శుక్రవారం పణతూరు రోడ్డులో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ విషయంపై ప్రస్తుతం ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇక్కడ నెలకొన్న ట్రాఫిక్ సమస్యతో బైకుపై వెళుతున్న ప్రతి ఒక్కరూ రోడ్డు పక్కన డ్రెయిన్ కోసం తీసిన కాలువలో గుండా బైకుపై వెళుతున్న వీడియోను చూసి ఔరా..ఇది బెంగళూరా? ఆని నివ్వెర పోతున్నారు. మరో పక్క నెటిజన్లు బెంగళూరు రోడ్డు దుస్థితిని గురించి విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.


