లోకాయుక్తకు చిక్కిన హెడ్‌కానిస్టేబుల్
మండ్య: లంచం తీసుకుంటూ హెడ్‌కానిస్టేబుల్ లోకాయుక్తకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మండ్య జిల్లా మళవళ్లి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మళవళ్లి తాలూకా అంచెదొడ్డి గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తిని రూరల్‌్ పోలీసులు ఒకే కేసు విషయంలో అరెస్ట్ చేశారు. అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నీపై రౌడీషీట్ తెరుస్తామని నవీన్‌ను హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్ బెదిరించి రూ. 5వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్‌లో నవీన్ వెంకటేశ్‌కు నగదు అందజేస్తుండగా లోకాయుక్త అధికారులు దాడి చేశారు. వెంకటేశ్‌ను అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు.


