లా విద్యార్థి అకృత్యం
● మస్కిలో బాలికకు గర్భం చేసిన వైనం
● పోక్సో కేసు నమోదు
రాయచూరు రూరల్: లా కోర్సు చదివే విద్యార్థిపై పోక్సో కేసు నమోదైన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. దేఽశాయి భోగాపురకు చెందిన శివమూర్తి(25) అనే యువకుడు కొప్పళలో ఎల్‌ఎల్‌బీ విద్యనభ్యసిస్తున్నాడు. మస్కి తాలూకాలోని ఒక మైనర్ బాలికను లోబర్చుకొని గర్భిణిని చేశాడు. దీంతో గర్భం తొలగించుకోడానికి ఆ బాలిక అధిక మోతాదులో మాత్రలు మింగింది. అస్వస్థతకు గురైన బాలికను రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వచ్చి బాధితురాలితో మాట్లాడారు. శివమూర్తి అకృత్యం బయట పడటంతో పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు మస్కి సీఐ బాలచంద్ర డీ.లక్కం తెలిపారు.
చెరకు ధర విషయంలో సీఎం రాజకీయం
● కేంద్రమంత్రి కుమారస్వామి మండిపాటు
మైసూరు: చెరకు పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని, అయితే దానిని సీఎం సిద్దరామయ్య అమలు చేయకుండా రాజకీయం చేస్తూ కేంద్రంపై నెపం వేస్తున్నారని కేంద్రమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మైసూరులో మీడియాతో మాట్లాడారు. సిద్దరామయ్య సీనియర్ రాజకీయ నేత అని, ఎన్నో సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవం ఆయనకు ఉందని, ఆయన మనసు పెడితే చెరకు పంటకు మద్దతు ధర ప్రకటించడం పెద్ద సమస్య కాదన్నారు. అయితే కేంద్రంపై నిందలు వేస్తూ ప్రధాని మోదీని ఇరికించాలని సిద్దూ కుట్రలు చేస్తున్నారని కుమారస్వామి మండిపడ్డారు. ఇప్పటికై నా రైతుల హితవును దృష్టిలో ఉంచుకొని సీఎం నిర్ణయం తీసుకోవాలన్నారు.
గాలి ఆంజనేయస్వామి సన్నిధిలో మోహన్ భాగవత్
దొడ్డబళ్లాపురం: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ శుక్రవారం బెంగళూరు మైసూరు రోడ్డులో ఉన్న గాలి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటై వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్‌ఎస్ దేశ వ్యాప్తంగా విజయదశమి ఉత్సవాలు, యువ సమావేశం, ఇంటింటి భేటి, హిందూ సమ్మేళనం, సామాజిక సద్భావనా సమావేశం ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈనెల 8,9న బెంగళూరులో ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు విచ్చేసిన మోహన్ భాగవత్ గాలి ఆంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు.
భార్యపై అనుమానంతో
భర్త కిరాతకం
దొడ్డబళ్లాపురం: భార్యపై అనుమానంతో భర్త ఆమైపె కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన బెంగళూరు అమృతహళ్లిలోని గంగమ్మ లేఔట్‌లో చోటు చేసుకుంది. కూరగాయల దుకాణంలో పని చేస్తున్న అంజలి(20)ని ఆమె భర్త రవిచంద్ర కత్తితో పొడిచి హత్య చేశాడు. ట్రావెలర్స్ కార్యాలయంలో పని చేసే రవిచంద్ర భార్యపై అనుమానంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కేసు నమోదు చేసుకున్న అమృతహళ్లి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
అడవి పంది దాడిలో
రైతు మృతి
మైసూరు: అడవి పంది దాడిలో రైతు మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హాడ్యా గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు రంగస్వామి(35) శుక్రవారం బైక్‌లో హుర గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా మార్గం మధ్యలో అడవి పంది దాడి చేసింది. బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు రాగా అడవి పంది ఉడాయించింది. గాయపడిన రంగస్వామిని మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. హుల్లహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
లా విద్యార్థి అకృత్యం
లా విద్యార్థి అకృత్యం


