కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం
మాలూరు : కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని ఎమ్మెల్యే కేవై నంజేగౌడ అన్నారు. నగరంలోని యోజనా ప్రాధికారకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న ఎం విజయ నరసింహా, ఇతర సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతన పదాధికారులు అందరి సహకారంతో నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. యోజనా ప్రాధికార నూతన అధ్యక్షుడు విజయనరసింహ మాట్లాడుతూ ఎమ్మెల్యే మార్గదర్శనంలో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సి లక్ష్మీనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాపుర కిట్టి, శెట్టిహళ్లి రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.


