కార్తీక దీపోత్సవం.. మురిసిన భక్తజనం
దీపకాంతుల్లో విరుపాక్షేశ్వర దేవస్థానం మిరుమిట్లు
ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగిస్తున్న భక్తులు
కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేసిన దృశ్యం
బళ్లారిఅర్బన్: దక్షిణ కాశీ హంపీలో కార్తీక దీపోత్సవం బుధవారం రాత్రి ఎంతో ఉత్సాహంగా జరిగింది. గౌరీ పౌర్ణమి సందర్భంగా చుట్టు పక్కల జిల్లాలు, గ్రామాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చి హంపీలోని విరుపాక్షేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఆలయం ముందు రంగోలి వేసి, నెయ్యి దీపాలు, నూనె దీపాలు వెలిగించి తమ భక్తిని చాటారు. హంపీలోని ప్రసిద్ధ విరుపాక్షేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన దీపోత్సవంలో విజయనగర, బళ్లారి, రాయచూరు చిత్రదుర్గ, కొప్పళ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపీని చూడటానికి వచ్చిన విదేశీ పర్యాటకులు కూడా కార్తీక దీపోత్సవాన్ని ఆస్వాదించారు. అంతేకాకుండా దీపాలను వెలిగించి భారతీయ పండుగలో ఉత్సాహంగా పాల్గొనడం కనిపించింది.
రాయచూరు రూరల్: కార్తీక మాసం అంటే దీపాలు వెలిగించే పండుగ అని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా తుంగా తీరంలో తుంగారతిని ప్రారంభించి మాట్లాడారు. రాఘవేంద్ర స్వాముల మూలవిరాట్‌కు పూజలు జరిపారు. తుంగభద్ర నదిలో భక్తులు పోటెత్తారు.
భక్తిశ్రద్ధలతో నెయ్యి, నూనె దీపాలను
వెలిగించిన వైనం
హంపీకి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
కార్తీక దీపోత్సవం.. మురిసిన భక్తజనం
కార్తీక దీపోత్సవం.. మురిసిన భక్తజనం
కార్తీక దీపోత్సవం.. మురిసిన భక్తజనం
కార్తీక దీపోత్సవం.. మురిసిన భక్తజనం


