
దీపావళి కోలాహలం
విభిన్న రీతుల్లో ఆకట్టుకుంటున్న మట్టి దీపాలు
సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ కిటకిట
రోడ్డు పక్కన అరటి పిలకల అమ్మకాలు
బళ్లారి, హొసపేటెలో ఆదివారం దీపావళి కోలాహలం నెలకొంది. దీపావళి, లక్ష్మీపూజను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. బళ్లారిలో పారిశ్రామిక వాడగా పేరొందిన తోరణగల్లు, తోరణగల్లు ఆర్‌ఎస్‌లో పూజా సామగ్రి కొనుగోళ్లతో సందడి వాతావరణం కనిపించింది. ఉత్తరాది, దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు చెందిన జిందాల్ కార్మికులు, అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు, కూలీలు పూలు, పండ్లు, కొత్త దుస్తులు, అరటి పిలకలు, మట్టి దీపాలు కొనుగోలు చేశారు. మరోవైపు పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు కిక్కిరిశాయి. పండుగ సందర్భంగా పూలు పండ్లు, టెంకాయలు, కాయకూరలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. మట్టి ప్రమీదలను నగరంలో ప్రముఖ రహదారుల్లో అమ్మకానికి ఉంచారు.
– బళ్లారి రూరల్/హొసపేటె:

దీపావళి కోలాహలం

దీపావళి కోలాహలం

దీపావళి కోలాహలం

దీపావళి కోలాహలం

దీపావళి కోలాహలం