
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల కవాతు
చెళ్లకెరె రూరల్: దేశంలోనే అతి పెద్ద స్వయం సేవా సంఘం అని పేరొందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాల నిమిత్తం నగరంలో ఏర్పాటు చేసిన భవ్య కవాతు అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గణవేషంతో పాటు 250 మందికి పైగా స్వయం సేవకులు పాల్గొన్నారు. నగరంలోని గాంధీ నగర్, బసవేశ్వర సర్కిల్, నెహ్రు సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్, త్యాగరాజ్ నగర్ వంటి ప్రముఖ రహదారుల్లో కవాతు సాగింది. ఈ సందర్భంగా ప్రజలు, ఆర్‌ఎస్‌ఎస్ అభిమానులు పూలవర్షం కురిపించారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ సదృఢ, ఆరోగ్యకర సమాజ నిర్మాణం కోసం పని చేస్తుందన్నారు. హిందూ పరంపర, సనాతన సంస్కృతి రక్షణే ధ్యేయంగా దేశ ప్రేమికుల శక్తిసాలి సంఘంగా పేరు పొందిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు రాందాస్, చెళ్లకెరె బీజేపీ మండల అధ్యక్షుడు బీఎల్ సురేష్, జయపాలయ్య, డాక్టర్ మంజునాథ్, శ్రీనివాస్, దయానంద్, ప్రహ్లాద్, మారుతీ తదితరులు పాల్గొన్నారు.