రాయచూరు రూరల్: పేదలకు భూములు కేటాయించాలని కుర్డి గ్రామస్తులు డిమాండ్ చేశారు. శనివారం మాన్వి తాలూకా కుర్డిలో ఎమ్మెల్సీ వసంత్ కుమార్‌ను కలిసిన గ్రామ ప్రజలు మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధీనంలోని భూములను సాగు చేస్తున్న సన్నకారు రైతులపై అధికారులు కేసు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు.
అక్రమార్కులపై చర్యలేవీ?
కోలారు : బాల్య వివాహాలు, పోక్సో, చిన్నారులను దత్తత ఇచ్చే ప్రక్రియలో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత రైతు సేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం జిల్లా ఎస్పీకి సంఘటన అధ్యక్షుడు హుణసనహళ్లి వెంకటేష్ వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పథకం కింద వస్తున్న నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.