
మార్కెట్లకు దీపావళి శోభ
సాక్షి బళ్లారి: ప్రతి ఏటా కార్తీక మాస అమావాస్య రోజున వచ్చే దీపావళి పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సోమవారం దీపావళి పండుగను పురస్కరించుకొని ముందుగానే ప్రమిదలు(మట్టి దీపాలు) కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. దీపావళి పండుగ అంటేనే టపాసులు పేల్చడంతో పాటు ఇంటింటా మట్టి దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా మట్టి దీపాలను నగరంలోని సంగం సర్కిల్, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో, బెంగళూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో మట్టి దీపాలను అమ్మకానికి ఉంచడంతో కొనుగోలు చేస్తున్నారు.
ఇంట్లో మట్టి దీపాలు వెలిగిస్తే మేలు
దీపావళి రోజున మట్టి దీపాలు ఇంట్లో వెలిగిస్తే మంచి జరుగుతుందని నమ్మకం ఉండటంతో మట్టి ప్రమిదలను జోరుగా కొనుగోలు చేస్తున్నారు. అలాగే వాహనాలకు, ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తున్న నేపథ్యంలో పూలు, పండ్లు కొనుగోలు చేయడంతో బెంగళూరు రోడ్డు, చిన్న మార్కెట్, పెద్ద మార్కెట్ జనంతో కిటకిటలాడింది. దీపావళి అంటేనే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆనందంగా జరుపుకునే పండుగ కావడంతో సంప్రదాయ బద్ధంగా ఆచరించుకునేందుకు సర్వ సిద్ధం చేసుకుంటున్నారు.
జోరుగా బాణసంచా కొనుగోళ్లు
హొసపేటె: లక్షలాది మంది భారతీయులు దీపావళిని జరుపుకుంటున్నారు. దేశంలోని అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన హిందువుల దీపాల పండుగ దీపావళి సందర్భంగా శనివారం నగరవాసులు బళ్లారి రోడ్డులో కారిగనూరు వద్ద ఏర్పాటు చేసిన శ్రీనివాస క్రాకర్స్ దుకాణంలో తమకు కావాల్సిన టపాసులను జోరుగా కొనుగోలు చేశారు. ఈ దుకాణాల్లో టపాసులను కిలోల ప్రకారంగా అమ్ముతుండడంతో పండుగ ముందే నగర ప్రజలు టపాసులు కొనుగోలు చేసేందుకు క్యూ కట్టారు.
మట్టి ప్రమిదలకు భలే డిమాండ్
జోరుగా పూజ సామగ్రి విక్రయాలు

మార్కెట్లకు దీపావళి శోభ

మార్కెట్లకు దీపావళి శోభ