వీధి కుక్కల దాడి.. 25 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వీధి కుక్కల దాడి.. 25 మందికి గాయాలు

Oct 19 2025 6:27 AM | Updated on Oct 19 2025 6:27 AM

వీధి

వీధి కుక్కల దాడి.. 25 మందికి గాయాలు

రాయచూరు రూరల్‌: నగరంలో వీధి కుక్కలు దాడి చేయడంతో 25 మంది గాయాల పాలైన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నగరంలోని బైరూన్‌ కిల్లా, తిమ్మాపూర్‌పేట, ఖూనీ మసీదు, ఇతర ప్రాంతాల్లో వీధి కుక్కలు పిల్లలు, మహిళలపై దాడి చేసి గాయపరచడంతో రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పీడీఓకు ఎంపీ అండ

సాక్షి బళ్లారి: ఆర్‌ఎస్‌ఎస్‌ కవాతు కార్యక్రమంలో పాల్గొన్నాడని రాయచూరు జిల్లా లింగసుగూరు తాలూకాకు చెందిన పీడీఓ ప్రవీణ్‌కుమార్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం బీజేపీ లోక్‌సభ సభ్యుడు తేజస్వీసూర్య సదరు పీడీఓకు అండగా నిలిచారు. ధైర్యంగా ఉండాలని, చట్టపరంగా పోరాటం చేసి తిరిగి ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని ఎక్స్‌లో పేర్కొన్నారు.

బాపనయ్యదొడ్డిలో మరుగుదొడ్లు నిర్మించరూ

రాయచూరు రూరల్‌: నగరంలోని 147వ వార్డులోని బాపనయ్యదొడ్డిలో మరుగుదొడ్లను నిర్మించాలని నవరత్న యువక సంఘం డిమాండ్‌ చేసింది. శనివారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శరణప్ప మాట్లాడారు. నగరసభ నుంచి స్వచ్ఛ భారత్‌ మిషన్‌ పథకం నుంచి నిర్మిస్తున్న పనులను కొనసాగించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

సేవలకు సన్మానం

సాక్షి బళ్లారి: ఈ నెల 17న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో రోటరీ ఇండియా కార్యక్రమంలో విద్యా, జల నిర్వహణ రంగాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తుగా జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌ ముఖ్యులను సన్మానించారు. సంస్థ ప్రతినిధులు పెద్దన్న బిడార, రాజశేఖర్‌రాజు అవార్డును స్వీకరించారు. గ్రామాల్లో చదువులు, జల సంరక్షణ కోసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మైనర్‌ బాలికతో పెళ్లి కేసులో ఆరుగురికి జైలు శిక్ష

హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని గద్వాల్‌ క్యాంప్‌ గ్రామంలో 14 ఏళ్ల మైనర్‌ బాలికను వివాహం చేసుకున్న కేసులో గంగావతి ప్రిన్సిపల్‌ సివిల్‌, జేఎంఎఫ్‌సీ కోర్టు న్యాయమూర్తి నాగేష్‌ పాటిల్‌ ఆరుగురు నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు. 2020 మే 22న ఉదయం 11.30 గంటలకు గద్వాల్‌ క్యాంప్‌ గ్రామంలోని ఒక చర్చిలో బాల్య వివాహం జరిగింది. బాలిక తల్లిదండ్రులు, వరుడి కుటుంబం, చర్చి ఫాదర్‌ ఈ వివాహాన్ని నిర్వహించారు. ఈ కేసులో నిందితులు కూరపన్న, అతని తండ్రి యేసు, తల్లి శాంతమ్మ, చర్చి ఫాదర్‌ డి.అబ్రహం అందరూ బాల్య వివాహ నిషేధ చట్టం–2006లోని సెక్షన్లు 9, 10, 11 కింద దోషులుగా ఖరారయ్యారు. అప్పటి దర్యాప్తు అధికారి, పీఎస్‌ఐ జే.దొడ్డప్ప దాఖలు చేసిన చార్జిషీట్‌ ఆధారంగా కోర్టు విచారణ నిర్వహించింది. అక్టోబర్‌ 14న ప్రచురించిన తీర్పులో, నిందితులందరికీ ప్రతి సెక్షన్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు.

కార్యాలయాల్లో

పరిశుభ్రత కాపాడండి

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లాలోని కార్యాలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈశ్వర్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆయన శనివారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మాట్లాడారు. తాలూకా, గ్రామ స్థాయిలో ప్రతి శనివారం స్వచ్ఛతకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ముందుకు రావాలన్నారు. పాత తాలూకా, జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయాలను తనీఖీ చేసి నూతన భవన నిర్మాణానికి సంబంధించి అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించారు.

పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

చెళ్లకెరె రూరల్‌: పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే టి.రఘుమూర్తి తెలిపారు. ఆయన తాలూకాలోని సిద్దాపుర గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన బీఎంసీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తాలూకాలో పశువులను సంరక్షించే పాడి ఉత్పత్తిదారులను గుర్తించి రూ.25 వేల ప్రోత్సాహధనం ఇస్తారన్నారు. కార్యక్రమంలో సిద్దాపుర పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు గద్దిగె తిప్పేస్వామి, చిత్రదుర్గ పాల ఉత్పత్తిదారుల సంఘం నిర్దేశకులు బీసీ సంజీవమూర్తి, సిద్దాపుర మాజీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పాత లింగప్ప, శివమొగ్గ, దావణగెర, చిత్రదుర్గ జిల్లా పాల ఉత్పత్తిదారుల అధ్యక్షుడు హెచ్‌ఎం.విద్యాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

చికిత్స పొందుతున్న మహిళ, వ్యక్తి, చిన్నారి

వీధి కుక్కల దాడి..  25 మందికి గాయాలు 1
1/3

వీధి కుక్కల దాడి.. 25 మందికి గాయాలు

వీధి కుక్కల దాడి..  25 మందికి గాయాలు 2
2/3

వీధి కుక్కల దాడి.. 25 మందికి గాయాలు

వీధి కుక్కల దాడి..  25 మందికి గాయాలు 3
3/3

వీధి కుక్కల దాడి.. 25 మందికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement