
రక్తదానంపై జాగృతి జాతా
రాయచూరు రూరల్ : అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఇంచార్జి జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారి గణేష్ పేర్కొన్నారు. శనివారం తమ కార్యాలయం వద్ద జెడ్పీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, రోటరీ క్లబ్, రిమ్స్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన జాగృతి జాతాను ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తం పుట్టుకు వస్తుందన్నారు. రక్తదానం చేయడంతో ఇతరులకు ఉపయోగపడుతుందన్నారు. రక్తం ఇవ్వడం వల్ల మనిషి దేహంలో కొత్త రక్తం పుట్టి శుద్ధీకరణ అవుతుందన్నారు. జాతాలో వైద్యాధికారులు మనోహర్ పత్తార్, శాకీర్, సరోజ, లేపాక్షయ్యలున్నారు.
సీపీఐ(ఎంఎల్) అభ్యర్థి
అరెస్ట్ తగదు
రాయచూరు రూరల్: బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి అరెస్ట్ తగదని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆరోపించింది. శనివారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనను ఉద్దేశించి అధ్యక్షుడు మహ్మద్ హనీఫ్ మాట్లాడారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థులు జితేంద్ర పాస్వాన్, సత్యదేవ్ రామ్‌లను పాలక పార్టీ బలవంతంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు. ప్రజా ప్రభుత్వంలో పోటీకి అందరు అర్హులే అయినా పోటీ నుంచి విరమించుకోడానికి ఇలాంటి కుట్రలు పన్నడం తగదన్నారు. నామినేషన్లు సమర్పించిన వెంటనే వారిని అరెస్ట్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి 75 లక్షల మంది మహిళల ఖాతాలకు రూ.10 వేలను జమ చేయడం జరిగిందన్నారు. అరెస్ట్ చేసిన నేతలను విడిచి పెట్టాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు జిల్లాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు.
సంబంధాల క్షీణతతో మానసిక ఒత్తిడి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలో కుటుంబాల్లో సంబంధాలు తెగడం వల్లే ఒత్తిడి అధికమై మానసిక ప్రశాంతతను కోల్పోతున్నట్లు జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి స్వాతిక్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఆరోగ్య శాఖ కృష్ణ భవనంలో జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మానసిక ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. దైనందిన కార్యక్రమాలు, పని ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో సతమతమైన మానవుడు మానసికంగా మారిపోతాడన్నారు. మానసిక ఆరోగ్య శాఖ అధికారి మనోహర్ పత్తార్, ఇంచార్జి జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారి గణేష్, శాకీర్, నందిత, సరోజ, ఈశ్వర్, అరవింద్ సంగావి, చంద్రశేఖరయ్యస్వామి, దాసప్పలున్నారు.
అనుచిత వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలి
రాయచూరు రూరల్: బసవ మఠాధీశులను అవమానించిన స్వామీజీపై చర్యలు చేపట్టాలని జాగతిక లింగాయత మహాసభ డిమాండ్ చేసింది. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నాగనగౌడ మాట్లాడారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్ అదృశ్య కాడసిద్దేశ్వర స్వామీజీ బసవ సంస్కృతి అభియాన్‌పై దుష్ప్రచారం చేసి బసవ పంథాను ఆచరించే మఠాధీశులను అగౌరవ పరిచే విధంగా సమావేశంలో ప్రసంగించారని, అలాంటి వారిని సరిహద్దు బహిష్కరణ చేయాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానంద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శాంతప్ప, ఆంజనేయులు, విరుపాక్షి, గిరిజా శంకర్, చుక్కి సూగప్ప, ఉదయ్ కుమార్‌లున్నారు.

రక్తదానంపై జాగృతి జాతా

రక్తదానంపై జాగృతి జాతా

రక్తదానంపై జాగృతి జాతా