
ఆటో, క్యాంటర్ ఢీ.. మహిళ మృతి
శ్రీనివాసపురం: రెండు వాహనాలు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తాలూకాలోని ముళబాగిలు రహదారిలో మీసగానహళ్లి గేట్ వద్ద శనివారం చోటు చేసుకుంది. శ్రీనివాసపురం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో ముళబాగిలు వైపు వెళుతున్న ఆటో మీసగానహళ్లి గేట్ వద్దకు చేరుకోగానే ముళబాగిలు నుంచి శ్రీనివాసపురం వైపు వస్తున్న క్యాంటర్ ఢీకొంది. ఆటోలో ఉన్న 8 మంది తీవ్రంగా గాయపడ్డారు .క్షతగాత్రులను కోలారులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా యశోదమ్మ (50) అనే మహిళ చికిత్స పొందుతూ మరణించింది. డీఎస్పీ మోనిషా, ఎస్‌ఐ జయరాం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఆటో, క్యాంటర్ ఢీ.. మహిళ మృతి