విజయపురలో కదం తొక్కిన నిరుద్యోగులు | - | Sakshi
Sakshi News home page

విజయపురలో కదం తొక్కిన నిరుద్యోగులు

Oct 6 2025 2:46 AM | Updated on Oct 6 2025 2:48 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. ఆదివారం విజయపురలో ఏఐడీవైఓ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐడీవైఓ రాష్ట్ర కార్యదర్శి భవాని శంకర్‌ గౌడ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఏటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకుని కాలం గడపడాన్ని తప్పు బట్టారు.

బాధిత కుటుంబానికి చెక్కు అందజేత

రాయచూరు రూరల్‌: దద్దల్‌ తుంగభద్రలో ఇటీవల పిడుగుపాటుకు మృతి చెందిన దేవప్ప కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందని రాయచూరు రూరల్‌ శాసన సభ్యుడు బసనగౌడ తెలిపారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం దేవప్ప కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు.

క్రేన్‌ ఢీకొని

గుర్తు తెలియని వ్యక్తి మృతి

హుబ్లీ: గుర్తు తెలియని వ్యక్తిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం ఇక్కడి పాత బస్టాండ్‌ వద్ద చోటు చేసుకుంది. కిత్తూరు చెన్నమ్మ సర్కిల్‌ నుంచి వస్తున్న క్రేన్‌ వాహనం సదరు వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండవచ్చు. ఈ మేరకు ఉత్తర ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరిని బలిగొన్న ఈత సరదా

రాయచూరు రూరల్‌: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటి మునిగి మృతి చెందారు. ఈ ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. లింగసూగురు తాలుకా ముదుగల్‌కు చెందిన యలాలింగ (28), వెంకటేష్‌ (28) మస్కిలో సినిమా చూడటానికి వచ్చారు. సినిమా చూసిన అనంతరం వీరు మస్కి వద్ద ప్రవహిస్తున్న తుంగభద్ర ఎడమ కాలువలో ఈతకొట్టేందుకు దిగారు. అయితే వీరికి సరిగా ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్‌ పేర్కొన్నారు.

కసాప అధ్యక్షుడిగా విజయ రాజేంద్ర

రాయచూరు రూరల్‌: రాయచూరు తాలుకా కన్నడ సాహిత్య పరిషత్‌ అద్యక్షుడిగా డా.బి.విజయ రాజేంద్రను నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసినట్లు కన్నడ సాహిత్య పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు రంగణ్ణ పాటిల్‌ పేర్కొన్నారు. ఆదివారం ఓ పక్రటన విడుదల చేశారు. కసాప గౌరవ కార్యదర్శిగా రావుత రావ్‌, కార్యదర్శిగా ప్రతిభ, కోశాధ్యక్షుడిగా సయ్యద్‌ హఫీజుల్లా ఖాద్రి, సంఘటన కార్యదర్శిగా శరణప్ప, రేఖా పాటిల్‌, సభ్యులుగా దేవేంద్రమ్మ, వైశాలి పాటిల్‌, అమరేష్‌, ఖాన్‌ సాబ్‌, అశోక్‌ కుమార జైన్‌, మంజునాథ్‌ పాటిల్‌, విజయ కుమారి, వెంకటేష్‌ను నియమించారు.

రూ.1.50 కోట్లతో తాయమ్మ చెరువు అభివృద్ధి

రాయచూరు రూరల్‌: నగరంలో తాయమ్మ చెరువు అభివృద్ధికి రూ.1.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్‌ వెల్లడించారు. ఆదివారం గద్వాల రహదారిలోని తాయమ్మ చెరువు పునరుద్ధరణకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూగర్భ జలాల పెంపుదలలో భాగంగా జిల్లాలో చెరువుల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతోందన్నారు. తాగు, సాగు సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు కూరగాయలు పండించుకుని జీవనోపాధి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి, నగర సభ అధ్యక్షురాలు నరసమ్మ, రుద్రప్ప, శాంతప్ప, అమరే గౌడ, జయన్న, రాజు, సుభాష్‌, నరసింహలు, శాలం, అధికారులు పాల్గొన్నారు.

విజయపురలో  కదం తొక్కిన నిరుద్యోగులు 1
1/2

విజయపురలో కదం తొక్కిన నిరుద్యోగులు

విజయపురలో  కదం తొక్కిన నిరుద్యోగులు 2
2/2

విజయపురలో కదం తొక్కిన నిరుద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement