
మృత్యుశకటమైన ప్రైవేటు బస్సు
తుమకూరు: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొన్న దుర్ఘటనలో కారులోని ముగ్గురు చనిపోగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తుమకూరు తాలూకాలోని బెళదర గేట్ వద్ద శనివారం రాత్రి జరిగింది. కొరటిగెరె తాలుకాలోని కత్తినాగేనహళ్ళివాసులు శివకుమార్ (28), గోవిందప్ప (60), శివశంకర్ (28) మృతులు. పాల్ (28), రెడ్డిహళ్ళి శంకర్ (28)కు గాయాలు తగిలాయి. వీరందరూ ధర్మస్థలానికి కారులో వెళుతుండగా తుమకూరు నుంచి పావగడకు వెళుతున్న ప్రైవేటు బస్సు ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వచ్చి వీరి కారు మీదకు దూసుకెళ్లింది. కారు తుక్కుతుక్కయింది. ఐదుమంది కారులో చిక్కుకుపోయారు. బస్సు డ్రైవర్ బస్సును వదిలి పరారయ్యాడు. స్థానికులు, తుమకూరు గ్రామీణ పోలీసులు కారును విడదీసి మృతులను, గాయపడినవారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
కారును ఢీ, ముగ్గురు మృతి
తుమకూరు జిల్లాలో ఘటన

మృత్యుశకటమైన ప్రైవేటు బస్సు