
రాచనగరిలో అదే సందడి
మైసూరు: రాచనగరిలో దసరా మహోత్సవాలు ముగిసినా కూడా పర్యాటకుల సంఖ్య పర్యాటకులు మాత్రం తగ్గడం లేదు. జంబూసవారీని వీక్షించాలని వచ్చిన టూరిస్టులు, ఇతర జిల్లాలవారు నగరంలోనే మకాం వేశారు. మైసూరుతో పాటు పరిసర ప్రాంతాలలోని చారిత్రక కట్టడాలను తిలకిస్తూ గడుపుతున్నారు. ఆహారమేళాతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిలిచిపోయాయి. కానీ హోటళ్లలో భోజనాలు ఆరగిస్తూ నగర పర్యటనలో నిమగ్నమయ్యారు. సాయంత్రం కాగానే నగర కూడళ్లలో విరాజిల్లుతున్న విద్యుత్ కాంతులను చూస్తూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. దాంతో సాయంత్రం 6 గంటల నుంచి సిటీలో ఎక్కడ చూసినా జనం, కార్ల సందడి నెలకొంటోంది. ఈ నెల, 12వ తేదీ వరకు దీపాలంకరణ కొనసాగుతుంది. విదేశీ టూరిస్టులతో కొందరు సెల్ఫీలు తీసుకున్నారు.
ఎటుచూసినా పర్యాటకులే

రాచనగరిలో అదే సందడి