
పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలి
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్‌లో పండించిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరలు ప్రకటించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కొప్పళ జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్షుడు రుద్రప్ప మాట్లాడారు. కల్యాణ కర్ణాటక భాగంలోని కొప్పళ, బళ్లారి, రాయచూరు, యాదగిరి, కలబుర్గి, బీదర్, విజయనగరం జిల్లాల్లో వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. వాణిజ్య పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మెక్కజొన్న క్వింటాల్‌కు రూ.4,500 మద్దతు ధర ప్రకటించాలన్నారు. అనంతరం తహసీల్దార్ మురళీధర కులకర్ణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శివప్ప, మారుతి, శరణప్ప, సిద్ధప్ప, తిలక్, మరియప్ప, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నష్టపోయిన
రైతులను ఆదుకుంటాం
రాయచూరు రూరల్: జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ తెలిపారు. శనివారం వారు వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిరవార తాలుకాలోని నవలకల్, కురుకుంద, వడవాటిలో దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రైతుల పొలాల వద్దకు వెళ్లి సర్వేలు జరపాలని మంత్రి అధికారులకు సూచించారు. పంట నష్ట పరిహరం రైతులకు అందలేదని ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎకరాకు రూ.25 వేల పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
బీజేపీ బలోపేతానికి
కృషి చేయాలి
రాయచూరు రూరల్: నగరంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆత్మనిర్భర భారత్ శిబిరాలు ఏర్పాటు చేశారు. శాసన సభ్యుడు శివరాజ పాటిల్, మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎన్డీఏ పాలనలో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు. ప్రధాని మోదీ పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, పదాదికారులు రాఘవేంద్ర, శశిరాజ్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మామిడి చెట్ల
నరికివేతపై కేసు నమోదు
హుబ్లీ: పొలంలోకి అక్రమంగా ప్రవేశించి మామిడి చెట్లను నరికివేశారనే ఆరోపణలపై హావేరి జిల్లా సిగ్గావి సవనూరు ఎమ్మెల్యే యాసీర్ అహ్మద్ ఖాన్ పఠాన్‌తో పాటు సర్వేశాఖ ముఖ్య అధికారి జగదీశ్, ఏడీఎల్ సత్యనారాయణప్ప, తాలూకా సర్వేయర్ మంజునాథ్‌పై హనగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. హనగల్ తాలూకా హాలెకోటె గ్రామం వద్ద తాము కొనుగోలు చేసిన పొలంలోకి ఎమ్మెల్యే యాసీర్ అహ్మద్ ఖాన్ పఠాన్ అక్రమంగా ప్రవేశించి కొలతలు వేశారని ధార్వాడ న్యాయవాది ఫక్కీర్ గౌడ వీరన్నగౌడ పాటిల్ తెలిపారు. అంతేకాకుండా 25 ఏళ్ల నాటి పాత మామిడి చెట్లను జేసీబీ తదితర యంత్రాలతో తొలగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు.
అంగన్‌వాడీల్లో సకల సౌకర్యాలు
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు తాలూకా ఉజ్జిని గ్రామం సిద్దేశ్వర్ నగర్‌లోని అంగన్‌వాడీ సెంటర్‌లో శనివారం ఎల్‌కేజీ, యుకేజీ తరగతులను ప్రారంభించారు. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు బి.చౌడప్ప చెట్టుకు నీరు పోసిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రంలో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు శివగంగమ్మ, కురుగోడు సిద్ధేష్, మాజీ ఉపాధ్యక్షురాలు రేఖ మరియప్ప, వార్డు సభ్యులు మంజునాథ్ స్వామి, నాగరత్నమ్మ వి.లోకేశ్, రవి, అంగన్‌వాడీ కార్యకర్తలు ఏ.శాంతమ్మ ఎం.జ్యోతి ఎం.రేణుక ఎన్.సుమంగళ, పుష్పావతి, సహాయకులు పాల్గొన్నారు.

పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలి

పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలి

పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలి