
‘వైద్య వృత్తి పవిత్రమైనది’
హుబ్లీ: వైద్య వృత్తిని ధన ధారదత్తం చేయరాదని సీ్త్ర రోగ నిపుణురాలు డాక్టర్ దత్తప్రసాద్ గిజరే సూచించారు. బెళగావిలోని సమీపంలో బసవన కుడచి దేవరాజ అరసు కాలనీలోని చెన్నమ్మ హిరేమఠ వృద్ధాశ్రమంలో వైద్య విద్యార్థులకు యూనిఫారం, వైద్య పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఓ పవిత్రమైనదని తెలిపారు. 5 ఏళ్ల పాటు చక్కగా అధ్యయనం చేసి జ్ఞానాన్ని సంపాదించుకున్నారన్నారు. కారంజి మఠం గురుసిద్ధ స్వామి మాట్లాడుతూ.. జీవితంలో డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని తెలిపారు. మీరు ఎంపిక చేసుకున్న మార్గం అత్యంత పవిత్రమైందని కితాబిచ్చారు. క్రమశిక్షణతో వైద్య కోర్సు పూర్తి చేసి సమాజ స్పృహతో సేవలు అందించాలని సూచించారు. ధనమే సర్వస్వం కాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య వృత్తిని డబ్బుతో ముడిపెట్టరాదన్నారు. డాక్టర్ మహంతేష రామన్నవర మాట్లాడుతూ.. విద్యార్థులు గురుతర బాధ్యతలను ఎరిగి విద్యార్జాన చేయాలన్నారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ సమన్వయ అధికారి ఎంఎస్ చౌగల, డాక్టర్ రోహిణి రేగినాళ, సుభాష్ రేగినాళ, కిరణ్, సుజిత, అజయ్ పూజారి, సంకేత కులకర్ణి, ఓం శ్రీ తదితరులు పాల్గొన్నారు.