
విధి నిర్వహణలో అలసత్వం తగదు
రాయచూరు రూరల్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దౌర్జన్యాల నియంత్రణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని జిల్లాధికారి నీతిష్ హెచ్చరించారు. శనివారం జిల్లాధికారి కార్యాలయంలో శాంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరణించిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వ సౌలభ్యాలు పొందడానికి అవకాశాలు కల్పించాలన్నారు. నకిలీ కుల ప్రమాణ పత్రాలు పొందే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ పుట్టమాదయ్య, నగర సభ కమిషనర్ జుబీన్ మోహపాత్రో, అధికారి పురురాజ సింగ్, సభ్యులు రవీంద్ర, కుమార్, హేమరాజ, రవి, రఘువీర్ నాయక్, పవన్, బసవరాజ్, సుదామ తదితరులు పాల్గొన్నారు.