
బాలింతల మరణాలను నియంత్రించాలి
రాయచూరు రూరల్: జిల్లాలో బాలింతల మరణాల నియంత్రణకు వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది ముందుండాలని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి సుబోద్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం మాన్వి తల్లీబిడ్డల ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులు, అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాదిరిగా తల్లీబిడ్డల ఆస్పత్రిలో సౌలభ్యాలు ఉన్నాయని తెలిపారు. బాలింతలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. గర్భిణులకు సాధారణ కాన్పులు చేయాలని తెలిపారు. బాలింతల మరణాల నియంత్రణలో భాగంగా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్సీహెచ్ అధికారిణి నందిత, అశోక్, రంగనాథ్ పాల్గొన్నారు.