
భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ
బళ్లారి రూరల్: రేడియాలజీ విభాగంలో జరిగిన ఆయుధ పూజ
హొసపేటె: ధర్మదగుడ్డకు అమ్మవారిని తీసుకెళ్తున్న దృశ్యం
బళ్లారి రూరల్: శస్తచికిత్సలో వాడే కత్తెర్లకు పూజలు
సాక్షి బళ్లారి: దసరా శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆయుధ పూజను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నగరంలో ఎటుచూసిన వాహనాలను శుభ్రం చేయించడం కనిపించింది. రైతులు, వ్యాపారస్తులు ఆయుధాలకు పూజలు చేశారు. జిల్లా ఎస్పీ శోభారాణి ఆధ్వర్యంలో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్టేషన్లలో తుపాకులను ఒక చోట ఉంచి విభూతి, కుంకుమ పూసి అలంకరించారు. దసరా పండుగ నేపథ్యంలో మార్కెట్లు కళకళలాడాయి. పూలు, పండ్లు, కొనుగోలు చేయడానికి ప్రజలు భారీగా తరలిరావడంతో నగరంలోని బెంగళూరు రోడ్డుతో పాటు వివిధ ప్రధాన రోడ్లు కిటకిటలాడాయి. పూలు, పండ్లకు గిరాకీ ఏర్పడింది.
హొసపేటె: దసరా పండుగ నేపథ్యంలో పూలు, పండ్లు ధరలు విపరీతంగా పెరిగాయి. నగర కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్, మదకరి నాయక సర్కిల్, గాంధీ చౌక్‌లోని పూల మార్కెట్ ప్రజలతో కిక్కిరిశాయి. బంతిపూలు గుచ్చు రూ.100 నుంచి, రూ.150, చామంతి ఒక గుచ్చు రూ.300 నుంచి రూ.350, మల్లె ఒక గుచ్చు రూ.400, గులాబీ ఒక కిలో రూ.400, ఆపిల్ కిలో రూ.150 నుంచి రూ.200 ధరలు పలికాయి. అరటి డజను రూ.60 నుంచి 70, దానిమ్మ రూ.100 నుంచి రూ.150, బూడిద గుమ్మడికాయ రూ.120 నుంచి 150 (పరిమాణాన్ని బట్టి), అరటి ఆకులు, చెరకు గడలు రూ.50 నుంచి రూ.60 వరకు అమ్ముడయ్యాయి.
బళ్లారి రూరల్: బీఎంసీఆర్‌సీ ఆసుపత్రిలోని ఎక్స్‌రే విభాగంలో యంత్రాలు, సీటీ స్కానింగ్ యంత్రాలు, కంపూటర్లకు పూజలు నిర్వహించారు. రేడియాలజీ విభాగంలో అమ్మవారిని కొలువుదీర్చారు. ప్రధాన ద్వారం వద్ద గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఆపరేషన్ థియేటర్ ముందు శస్త్ర చికిత్సలో వాడే కత్తెర్లు, యంత్రాలను పూజించారు. క్యాజువాలిటీ మందుల సరఫరా, గైనకాలజీ తదితర విభాగాల సిబ్బంది ఆయుధ పూజలు చేశారు. కార్యక్రమంలో బీఎంసీఆర్‌సీ డీన్ డాక్టర్ గంగాధర గౌడ, ప్రిన్సిపాల్ డాక్టర్ మంజునాథ్, సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, రేడియాలజీ విభాగ ప్రముఖుడు డాక్టర్ సదాశివగౌడ, డాక్టర్ విజయ్, డాక్టర్ కృష్టమూర్తి, శస్తచికిత్స వైద్యులు డాక్టర్ రాజశేఖర్ గౌడ, డాక్టర్ మహేష్ దేశాయ్, అనస్తీషియా వైద్యుడు డాక్టర్ బాలభాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు.
ధర్మదగుడ్డలో భక్తుల సందడి
హొసపేటె: తాలూకాలో నాగేనహళ్లి వద్ద వెలసిన విజయనగర సామ్రాజ్యం కాలం నాటి ధర్మదగుడ్డ వద్ద జమ్మి చెట్టుకు ప్రజలు పూజలు చేశారు. ఈ ఏడాది కూడా నగరంలో ఏడు వార్డుల్లో వాల్మీకి నాయకులు అమ్మవారిని పల్లకీలో కొలువుదీర్చారు. ఊరేగింపుగా ధర్మదగుడ్డకు తీసుకెళ్లారు. జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శన చేసి మొక్కులు తీర్చుకున్నారు.
హుబ్లీ: జంట నగరాల్లోని ఆలయాల్లో బుధవారం భక్తుల కోలాహలం నెలకొంది. కేఎంసీ ఆస్పత్రిలో దుర్గామాతను కొలువు దీర్చి ప్రత్యేక పూజలు చేయించారు. రిసెప్షన్ కౌంటర్, మానసిక విభాగం, మోదీ బిల్డింగ్ యూరాలజీ విభాగం, హృదయ విభాగాల ఉద్యోగులు వచ్చి అమ్మవారిని మొక్కుకున్నారు. మానసిక విభాగం హెచ్‌ఓడీ మహేష్ దేశాయి, అసోసియేషన్ ప్రొఫెసర్ సమీర్, డాక్టర్లు భాస్కర్, నివేదిక, రచన, అమూల్య, కేతరిన్, పలువురు సిస్టర్లు, మేల్ నర్సులు, వార్డు ఉమెన్ గంగమ్మ పాల్గొన్నారు.
హొసపేటెలో కిటకిటలాడిన మార్కెట్
బళ్లారిలో పూజా సామగ్రి కొనుగోలు చేస్తున్న ప్రజలు

భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ

భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ

భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ

భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ

భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ