
కరుణించమ్మా కాత్యాయిని
రాయచూరులో పూజలందుకున్న బిల్వ మందిరం మాత
రాయచూరు రూరల్: జిల్లాలో గురువారం శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని అల్లమ ప్రభు కాలనీలోని బిల్వ మందిరంలో అంబా భవాని మాతకు పూజలు జరిపారు. కోటలో కాళికా దేవి ఆలయంలో అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. దేవసూగూరు నాగర యల్లమ్మకు పువ్వులతో అలంకరణ చేశారు. మమదాపురలో మారికాంబను, కిల్లే బృహన్మఠంలో దేవిని అలంకరించారు. గుంజళ్లిలో కిల్లే బృహన్మఠ శాంత మల్ల శివాచార్యులు విశేష పూజలు జరిపారు. సిరవారలో దేవి విగ్రహం కోసం రూ.లక్ష విలువ చేసే అభరణాలను వెంకటేష్, పద్మావతిలు అందజేశారు.
అమ్మవారిని దర్శించుకొన్న మహిళలు
హొసపేటె: శరన్నవరాత్రుల సందర్భంగా నాలుగో రోజు గురువారం నగరంలోని చప్పరదహళ్లి, వాల్మీకి నగర్, బాణదకెరె, పటేల్ నగర్, టీబీ డ్యాం గాళెమ్మ గుడి, రాణిపేట, రైల్వే రహదారి, అంబా భవాని దేవాలయం, సాయిబాబా మందిరం, మూకాంబిక ఆలయం తదితర ప్రాంతాల్లో వివిధ వార్డుల్లో వెలసిన అమ్మవారి ఆలయాలు విశేష అలంకరణతో కనువిందు చేశాయి. ఉదయం ఆలయాల్లో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన, మంగళ హారతి తదితర పూజలు జరిపించారు. భక్తులు అమ్మ వారి ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు.
బన్ని చెట్టుకు ప్రత్యేక పూజలు
దసరా నవరాత్రుల సందర్భంగా నగరంలోని అమరావతిలో ఉన్న జమ్మి(బన్ని) చెట్టుకు గురువారం కాలనీ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సాంప్రదాయ పసుపు రంగు దుస్తులు ధరించి బన్ని చెట్టుకు పూజలు చేశారు.
విద్యానగర్‌లో కాత్యాయినిగా అమ్మవారు
బళ్లారిటౌన్: విద్యానగర్‌లో ఆభయ ఆంజనేయ స్వామి ఆలయంలో దసరా శరన్నవ రాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం నాలుగో రోజున కాత్యాయిని రూపంలో అమ్మవారిని అలంకరించారు. స్థానికులు ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకొని పూజలు సమర్పించారు.
బళ్లారిలో..
బళ్లారిఅర్బన్: విజయదశమి దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా నాలుగో రోజు గురువారం నగరంలోని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక అలంకరణ, పూజలు జరిపారు. నగర ప్రజల ఆరాధ్య దైవం కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి ఆభరణాలు, పూలతో అలంకరణ, ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి భ్రమరాంబా దేవి అలంకరణ, పటేల్‌నగర్ చిన్న దుర్గమ్మకు విశేష అలంకరణ, హవంబావి సీతారామ ఆశ్రమంలో లలితా దేవి అలంకరణ, బెంగళూరు రోడ్డు కన్యకాపరమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవి అలంకరణ, ఆలయ ప్రాంగణంలో వాసవీ దేవస్థాన ఆలయ ప్రాంగణంలో పూరీ జగన్నాథ్ అలంకరణ, నగరేశ్వరి ఆలయంలో పార్వతి దేవికి వెండి పూలతో అలంకరణ, బెంకి మారెమ్మకు విశేష అలంకరణ, మిల్లర్‌పేటె మల్నాడు దుర్గమ్మ ఆలయంలో విశేష అలంకరణ, చిన్నమార్కెట్ శాంభవి దేవి ఆలయంలో, సిరుగుప్ప రోడ్డు తుళజా భవానికి పండ్లతో అలంకరణ, ఫైర్ ఆఫీస్ ఆదిశక్తి ఆలయంలో, దేవినగర్ రేణుకా యల్లమ్మ ఆలయంలో, విద్యానగర్ కొల్హాపురి మహాలక్ష్మీ ఆలయంలో, సంతోషిమాత ఆలయం తదితర అమ్మవారి ఆలయాల్లో దేవీ నవరాత్రులను పురస్కరించుకొని విశేష అలంకరణ, ధార్మిక పూజలను నిర్వహించారు.
హొసపేటెలో వివిధ రూపాల్లో అమ్మవారికి అలంకరణలు
వైభవంగా శరన్నవ రాత్రి ఉత్సవాలు
నాలుగో రోజుకు అమ్మవార్లకు పూజలు

కరుణించమ్మా కాత్యాయిని

కరుణించమ్మా కాత్యాయిని

కరుణించమ్మా కాత్యాయిని

కరుణించమ్మా కాత్యాయిని

కరుణించమ్మా కాత్యాయిని

కరుణించమ్మా కాత్యాయిని

కరుణించమ్మా కాత్యాయిని

కరుణించమ్మా కాత్యాయిని

కరుణించమ్మా కాత్యాయిని

కరుణించమ్మా కాత్యాయిని