
సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృిషి
రాయచూరు రూరల్ : జిల్లాలో అభివృద్ధి చెందని ప్రాంతాలను సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ అన్నారు. బుధవారం మహాత్మ గాంధీ క్రీడాంగణంలో 77వ కల్యాణ కర్ణాటక విమోచన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. డాక్టర్ నంజుండప్ప నివేదిక ఆధారంగా సామాజిక, ఆర్థిక, విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించారన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆర్టికల్– 371(జే) వల్ల ఒనగూరే అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.20 13–2018 లో 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. 2023–28 మధ్యలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అక్షర అవిష్కార పథకంలో ఉపాధ్యాయుల నియామకాలు జరుపుతామని వెల్లడించారు. నిరుద్యోగులకు వృత్తిపర కోర్సులతో అధికంగా ఉద్యోగాలున్నాయన్నారు. ప్రభుత్వ కొలువుల్లో అందరికీ అవకాశముందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌ఎస్ బోసురాజ్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, ఎమ్మెల్సీలు శరణే గౌడ, వసంత్ కుమార్, జిల్లాధికారి నితిష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ పుట్టమాదయ్య, ఎస్పీ పుట్టమాదయ్య, ఏసీ గజానన, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఆర్డీయే అధ్యక్షుడు రాజశేఖర్ రామస్వామిలున్నారు. యాదగిరిలో రాష్ట్ర చిన్న పరిశ్ర మల శాఖ మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్, బీదర్‌లో అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే జాతీయ జెండాను అవిష్క రించారు.