
స్వర్ణ సింహాసనం సిద్ధం
మైసూరు: దసరా వేడుకల నేపథ్యంలో మైసూరు అంబావిలాస్ ప్యాలెస్‌లో ఉన్న దర్బార్ హాల్లో మైసూరు రాజవంశీకురాలు ప్రమోదాదేవి ఒడెయార్ ఆధ్వర్యంలో బంగారు సింహాసనాన్ని జోడించే పని చేపట్టారు. మంగళవారం విశేష పూజలు నిర్వహించి బంగారం, వజ్రాలు, రత్నాలు వంటి విలువైన రాళ్లు పొదిగిన సింహసనాన్ని కూర్చారు. విజయదశమి రోజున రాజ వంశీకుడు యదువీర్ ఒడెయార్ ఈ పీఠంపై కూర్చుని దర్బార్‌ను నిర్వహించడం ఆనవాయితీ. 22వ తేదీ నుంచి ప్యాలెస్‌లో నవరాత్రి పూజలు ఆరంభమవుతాయి.
జోష్‌గా యువ సంభ్రమ
మానస గంగోత్రిలో దసరా యువ సంభ్రమ సాంస్కృతిక వేడుకలు రోజూ సాయంత్రం నగరవాసులను ఉర్రూతలూగిస్తున్నాయి. గాన, నృత్య ప్రదర్శనలను వేలాదిమంది వీక్షిస్తున్నారు. మంగళవారం రాత్రి కళాకారులతో పాటు ప్రేక్షకులు కూడా పాటలు, సంగీతానికి చిందులు వేస్తూ మజా చేశారు.
మైసూరు ప్యాలెస్‌లో దసరా ఏర్పాట్లు