
దొంగల అరెస్టు, సొత్తు పట్టివేత
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలో వివిధ ఠాణాల పోలీసులు చోరీ కేసుల్లో దొంగలను అరెస్టు చేసి పెద్దమొత్తంలో బంగారు నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. జ్ఞానభారతి పోలీసులు కార్యాచరణ చేపట్టి అబ్రహాం, ధనుష్, నిఖిల్ అనే దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50 లక్షల విలువ చేసే 423 గ్రాముల బంగారు ఆభరణాలు, 710 గ్రాముల వెండి సామగ్రిని స్వాధీనపరచుకున్నారు.
● హలసూరు గేట్ పోలీసులు బంగారు వ్యాపారులను నమ్మించి మోసగించిన మనీష్ జైన్, ముఖేష్ జైన్ అనే వంచకులను పట్టుకున్నారు. వీరు ఓ జువెలరీలో బంగారు నగలు కొనుగోలు చేసి డబ్బులు ఎగ్గొట్టారు. అరెస్టు చేసి నగలను సీజ్ చేశారు.
50 వాచ్‌లు స్వాధీనం
● పరప్పన అగ్రహార పోలీసులు రూ.10 లక్షల విలువగల ప్రముఖ కంపెనీ వాచీలను స్వాధీనపరచుకున్నారు. ఓ కంపెనీలో పని చేస్తున్న నిందితుడు శేషాద్రిరెడ్డి వాచీలు సరఫరా చేసే సమయంలో కొన్నింటిని తస్కరించాడు. ఫిర్యాదులు రావడంతో నిందితున్ని బంధించి సుమారు 50 వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
● రిటైర్ట్ పోలీసు అధికారిని దోచుకున్న సయ్యద్ మౌసిన్, సయ్యద్ ఇర్ఫాన్, మహ్మద్ సల్మాన్ అనే నిందితులను సంజయ్‌నగర పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8 లక్షల విలువ చేసే నగలు, మూడు బైకులను స్వాధీనపరచుకున్నారు.
హలసూరు పోలీసులు సీజ్ చేసిన ఆభరణాలు, చేతి గడియారాలు
బెంగళూరులో ఖాకీల కార్యాచరణ

దొంగల అరెస్టు, సొత్తు పట్టివేత

దొంగల అరెస్టు, సొత్తు పట్టివేత