
యువనిధి ప్లస్ పథకం లబ్ధి పొందండి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో యువనిధి ప్లస్ పథకాన్ని వినియోగించుకోవాలని పంచ గ్యారెంటీల సమితి జిల్లాధ్యక్షుడు పామయ్య మురారి పిలుపునిచ్చారు. మంగళవారం ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయంలో జరిగిన యువనిధి ప్లస్ పథకం ద్వారా విద్యార్థులు, నిరుద్యోగ యువతీ యువకులు పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. కౌశల్య పథకం కింద నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారన్నారు. డిగ్రీ పాసైన తరువాత చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడకుండా ఆదాయం కోసం ప్రత్యేకర శిక్షణను ఇవ్వడంలో సిడాక్ ముందుందన్నారు. అదికవి మహర్షా వాల్మీకి విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద కెళగినమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిడాక్ అధికారి హుడేద్, సభ్యులు హన్మంతు, విశ్వవిద్యాలయ అధికారి వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి రోణ, నవీన్ కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
శాంతి భద్రతల రక్షణకు పెద్ద పీట
రాయచూరు రూరల్: బళ్లారి రేంజ్ పరిధిలోని రాయచూరు జిల్లాలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత కల్పించాలని రాయచూరు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభ సభ్యుడి కార్యాలయంలో బళ్లారి డివిజన్ ఐజీపీ వర్థిక కటియార్‌తో చర్చించారు. బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అక్రమంగా ఇసుక రవాణ, గంజాయి, మట్కా, జూదాలకు అవకాశం కల్పించరాదన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పుట్టమాదయ్య, అధికారులు శాంత వీర, హరీష్ తదితరులున్నారు.
ఏకలవ్య పాఠశాలలో ఎంపీ తనిఖీ
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా దేవదుర్గ ఏకలవ్య పాఠశాలను రాయచూరు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ తనిఖీ చేశారు. మంగళవారం దేవదుర్గ తాలుకా కొత్తదొడ్డి ఏకలవ్య గురుకుల పాఠశాలను పరిశీలించారు. 420 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఉత్తమ బోధన, పాఠ్యేతర విషయాలపై విద్యార్థులకు పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సలహా, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు.
ఎమ్మెల్యేలతో సీఎం ఇంటర్వూ
హుబ్లీ: నగరానికి వచ్చిన సీఎం తదితర ప్రముఖులు పాల్గొన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ఆనందోత్సాహాల మధ్య నెరవేరింది. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య ప్రసంగాన్ని ఇతర కార్యక్రమాలను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సంతోష్‌లాడ్ వీడియో కెమెరాతో చిత్రించగా ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి లోగో పట్టుకొని అచ్చంగా విలేకరిలా సీఎంని ఇంటర్వ్యూ చేశారు. ఈసందర్భంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. న్యూస్ 18 చానల్ ప్రధాన విలేకరి శివరామ అసుండి తొలుత అందరికీ స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాత్రికేయులు గురురాజు హూగార్, సంతోష్ పాటిల్, కిరణ్ బాకళె తదితరులు పాల్గొన్నారు.
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించండి
రాయచూరు రూరల్: 2025–26వ విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు, ఫలితాలను మెరుగు పరచడానికి ఉపాధ్యాయులు శ్రమించాలని, నగరంలో స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పించాలని నగరసభ కమిషనర్ జుబీన్ మహాపాత్రో పేర్కొన్నారు. సోమవారం నగరసభ కార్యాలయంలో అధ్యక్షతన జరిగిన 62 హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది 40 శాతం ఫలితాలు సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. పది రోజుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వంద శాతం ఉండాలన్నారు. ఉప కమిటీలను రచించి విద్యా రంగం అభివృద్ధికి శ్రమించాలన్నారు. సమావేశంలో సంతోష్ రాణి, జైపాల్, కృష్ణ కట్టిమని తదితరులు పాల్గొన్నారు.

యువనిధి ప్లస్ పథకం లబ్ధి పొందండి

యువనిధి ప్లస్ పథకం లబ్ధి పొందండి