
రాష్ట్రానికి మంత్రా? తాలూకాకు మంత్రా?
రాయచూరు రూరల్: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి ిసిద్దరామయ్య హైదరాబాద్–కర్ణాటక అభివృద్ధిని మరిచారని వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో చర్చలు తప్ప మరేమి లేదని రాష్ట్ర జేడీఎస్ యువ అధ్యక్షుడు నిఖిల్ కుమార స్వామి నిప్పులు చెరిగారు. మంగళవారం కలబుర్గిలో అతివృిష్టి, ప్రవాహ పీడిత ప్రాంతాల పర్యటనలో విలేకరులతో మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక పరిధిలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయ నగర జిల్లాల్లో వరదలు వచ్చి రైతులు వేసుకున్న పంటలు నాశనం అయ్యాయన్నారు. రైతుల కష్టాలను గురించి తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కానీ వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి కూడా పర్యటించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. చెలువరాయ స్వామి రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రా? లేక తాలూకాకు మంత్రా? అని నిఖిల్ కుమారస్వామి విమర్శించారు. 5 లక్షల హెక్టారుల్లో పంటనష్టం సంభవించిందన్నారు. కళ్యాణ కర్ణాటక పరిధిలో రూ.900 కోట్లను పరిహారం నిధులు కేటాయించాలన్నారు. రైతుల కష్టాలకు స్పందించని సర్కార్ అని ధ్వజమెత్తారు.
క.క భాగాన్ని మరచిన సీఎం
వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశం