
హోటళ్ల సమస్యలను పరిష్కరించాలి
బళ్లారి అర్బన్: అన్నదాతలైన హోటల్ యజమానులను ప్రభుత్వం గుర్తించాలని కర్ణాటక రాష్ట్ర హోటళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీకే శెట్టి పేర్కొన్నారు. శనివారం స్థానిక బళ్లారి జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రాష్ట్ర హోటళ్ల, బేకరీల సంఘం సమావేశాన్ని ఉడిపి జిల్లా కాపు ఎమ్మెల్యే గురుమే సురేష్ శెట్టి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాల్లో హోటళ్ల సంఘం ఆధ్వర్యంలో ఎందరికో ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. యజమానులు జీఎస్‌టీ, విద్యుత్, తాగునీరు, ఎక్సైజ్ తదితర ఎన్నో సమస్యలను ఎదుర్కొని సేవలు అందిస్తున్నామన్నారు. తమ సేవలను ప్రభుత్వం గురించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జీఎస్‌టీ పన్నుల భారం అధికంగా ఉన్నప్పటికీ ఇటీవల జీఎస్టీ పన్నులు తగ్గడంతో ఉపశమనం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉడిపి జిల్లా కాపు ఎమ్మెల్యే సురేష్ శెట్టి, రాష్ట్ర హోటళ్ల సంఘం అధ్యక్షుడు జీకే.శెట్టి, కార్యదర్శి మధుకర్ శెట్టి, మయూర మధుసూధన్, విక్రమ్ పోలా, యశ్వంత్‌రాజ్ నాగిరెడ్డి, సీకే.బాబు, ఆవార్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.