రాయచూరు రూరల్: వాలీబాల్ ఆడిన ఓ బాలుడు చెరువులో మునిగి దుర్మరణం పాలైన ఘటన నగరంలో చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం క్రిష్ణగిరి కాలనీలో ఆటలాడుతున్న గౌతమ్(15) కాలు జారి చెరువులో పడి మరణించినట్లు అనుమానిస్తున్నారు. గౌతమ్ స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడుతూ విశ్రాంతి కోసం చెరువు గట్టుపై కూర్చొన్నట్లు స్నేహితులు చెబుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన గౌతమ్ తల్లిదండ్రులు ఇడ్లీ బండిలో ఇడ్లీలు విక్రయించేవారు. సాయంత్రం 5 గంటలకు అగ్ని మాపక అధికారులు, సిబ్బంది వచ్చి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. పశ్చిమ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మోకా నాగరాజ్ తెలిపారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎస్‌ఐ సస్పెండ్
హుబ్లీ: విజయపుర జిల్లా భీమా తీరంలో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు భీమనగౌడ బిరాదార్ హత్య కేసు నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆధారంగా చడచణ ఎస్‌ఐ ప్రవీణ్‌ను జిల్లా ఎస్పీ లక్ష్మణ్ నింబరిగి సస్పెండ్ చేశారు. ఈ నెల 3న ఉదయం చడచణ తాలూకా దేవరనింబరిగిలో భీమనగౌడను దారుణంగా తుపాకీతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆరోజు ఉదయం కటింగ్ సెలూన్‌కు వచ్చిన భీమనగౌడ కళ్లలో కారం చల్లి నలుగురు దుండగులు తుపాకీలతో కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో ప్రదీవుల్లా, వసీమ్, ఫిరోజ్‌షేక్, మౌలానాబాద్ అనే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చురుగ్గా చేపట్టినట్లు ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు.
బీసీ వర్గాల సమీక్షకు
గడువు ఇవ్వాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన వర్గాల సమీక్షలను త్వరిత గతిన పూర్తి చేయాలని, తీసుకున్న నిర్ణయాలను పునః పరిశీలించాలని కల్యాణ కర్ణాటక బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు జగన్నాథ్ కులకర్ణి పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోిపించారు. కుల వర్గీకరణ సమీక్షలో బ్రాహ్మణ అని రాయించాలన్నారు. సాంఘీక, ఆర్థిక, విద్యా పరంగ డాటాను పొందడానికి సమయం కావాల్సి ఉందన్నారు. సర్కార్ 2026 డిసెంబర్ వరకు సర్వేలు చేయడానికి వీలు కల్పించి 2027లో నివేదికలను సమర్పించడానికి అవకాశం ఇవ్వాలన్నారు.
అభివృద్ధికి ప్రజలు సహకరించాలి
రాయచూరు రూరల్: గ్రామాల్లో అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర చిన్నపరిశ్రమల శాఖ మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్, యాదగిరి శాసన సభ్యుడు చెన్నారెడ్డి తన్నూరు పేర్కొన్నారు. శనివారం వడగేరలో మినీ విధానసౌధ, వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో గ్రామాలను మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడతామన్నారు. ప్రతి ఒక్కరూ విద్య, వైద్యం, ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో అంబిగర చౌడయ్య మండలి అధ్యక్షుడు బాబూరావ్ చించనసూరు, జిల్లాధికారి హర్షల్ బోయర్‌లున్నారు.
జైజై గణేశా.. బైబై గణేశా
● ఘనంగా వినాయక నిమజ్జనం
హొసపేటె: నగరంలోని చిత్రకేరిలో కూర్చొండబెట్టిన గణేష్ విగ్రహాన్ని ఎంతో ఉత్సాహంగా నిమజ్జనానికి తరలించారు. యువకులు 11 రోజుల పాటు ప్రతిష్టించి గణేష్‌కు ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జనం సందర్భంగా యువత నృత్యం చేసి సంబరాలు చేసుకున్నారు. నగర వీధుల్లో గణేష్ విగ్రహాల ఊరేగింపు ఎంతో ఉత్సాహంగా సాగింది.
చెరువులో మునిగి బాలుడు దుర్మరణం
చెరువులో మునిగి బాలుడు దుర్మరణం
చెరువులో మునిగి బాలుడు దుర్మరణం
చెరువులో మునిగి బాలుడు దుర్మరణం