
ఆల్మట్టి ఎత్తు పెంపునకు అడ్డుకోవద్దు
రాయచూరు రూరల్: కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక సర్కార్ సిద్ధంగా ఉండగా, ఈ విషయంలో మహారాష్ట్ర సర్కార్ డ్యాం ఎత్తు పెంచరాదంటూ కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించి మోకాలొడ్డిన నేపథ్యంలో రాష్ట్ర నేతలు కేంద్ర మంత్రులను కలిశారు. గురువారం కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సీ.అర్.పాటిల్‌ను ఢిల్లీలో కలసిన మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణ పలు అంశాలపై సుదీర్ఘంగా వివరించారు.