
విద్యుత్ కోత నిరసిస్తూ ఆందోళన
రాయచూరు రూరల్: నగరంలో విద్యుత్ కోత విధించడం తగదని కేపీసీసీ వెనుక బడిన వర్గాల విభాగం ఉపాధ్యక్షుడు టి.మారెప్ప పేర్కొన్నారు. గురువారం నగరంలోని తిమ్మాపూర్ పేటలో జెస్కాం సబ్ స్టేషన్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. నగరంలో దేవి జాతర ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో విద్యుత్ కోత విధించడాన్ని తప్పుబట్టారు. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొనకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ఉద్యోగులకు
ఆరో వేతనం చెల్లించరూ
రాయచూరు రూరల్: పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆరో వేతన శ్రేణిని చెల్లించాలని పదవీ విరమణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహదేవప్ప మాట్లాడారు. 2016లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వేతన పద్ధతిని అమలు చేయాలన్నారు. 2025లో పార్లమెంట్‌లో ఆర్థిక బిల్లుల బడ్జెట్‌లో పేర్కొన్నట్లు పెన్షన్‌ను కూడా ఆరో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా వేతనాలను చెల్లించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

విద్యుత్ కోత నిరసిస్తూ ఆందోళన