చెన్నమ్మ, రాయణ్ణ విజయ స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

చెన్నమ్మ, రాయణ్ణ విజయ స్ఫూర్తి

Jul 17 2025 3:21 AM | Updated on Jul 17 2025 3:21 AM

చెన్న

చెన్నమ్మ, రాయణ్ణ విజయ స్ఫూర్తి

బనశంకరి: బెళగావి వీర నారి, రాణి కిత్తూరు చెన్నమ్మ ఆంగ్లేయులతో యుద్ధం చేసి సాధించిన విజయానికి 201 సంవత్సరాలు అయ్యింది. ఈ నేపద్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరు లాల్‌బాగ్‌లో పుష్ప ప్రదర్శన ఆమె థీమ్‌తో ఏర్పాటు కానుంది. రాణి చెన్నమ్మ, ఆమె సైనికాధికారి క్రాంతివీర సంగోళ్లి రాయణ్ణల విజయాలు, జీవిత చరిత్ర ను చాటేలా పుష్ప ప్రదర్శన ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 18వ తేదీ వరకు లాల్‌బాగ్‌ గ్లాస్‌హౌస్‌లో ఫ్లవర్‌ షో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పూలు, వస్తు సామగ్రిని తెప్పిస్తున్నట్లు ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ (లాల్‌బాగ్‌) హెచ్‌టీ బాలకృష్ణ తెలిపారు.

7 లక్షల పుష్పాలతో

కిత్తూరు కోట, చెన్నమ్మ ఐక్య మంటపాన్ని 6 లక్షల నుంచి 7 లక్షల వైవిధ్యభరిత పూలతో రూపొందిస్తారు. కోట ముందు అశ్వాన్ని అధిరోహించిన చెన్నమ్మ, రాయణ్ణ విగ్రహాలుంటాయి. అమటూరు బాళప్ప, సేనాధిపతి గురుసిద్దప్ప, రాజగురు కల్మఠ స్వామీజీల విగ్రహాలను నెలకొల్పుతారు.

ఈసారి లాల్‌బాగ్‌ ఫ్లవర్‌ షో థీమ్‌

ఆగస్టు 7 నుంచి స్వాతంత్య్ర

దినోత్సవ ఫల పుష్ప ప్రదర్శన

చెన్నమ్మ, రాయణ్ణ విజయ స్ఫూర్తి1
1/2

చెన్నమ్మ, రాయణ్ణ విజయ స్ఫూర్తి

చెన్నమ్మ, రాయణ్ణ విజయ స్ఫూర్తి2
2/2

చెన్నమ్మ, రాయణ్ణ విజయ స్ఫూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement