
నేల తల్లి ఒడికి సరోజమ్మ
దొడ్డబళ్లాపురం: అలనాటి మేటి అభినయ సరస్వతి, బహుభాషా నటి బి.సరోజాదేవికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. సకల ప్రభుత్వ లాంఛనాలతో మహా నటికి మంగళవారంనాడు ఆమె స్వగ్రామం చెన్నపట్టణ తాలూకా దశవార గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. సరోజాదేవి సోమవారం బెంగళూరులో మల్లేశ్వరంలో తమ నివాసంలో కన్నుమూయడం తెలిసిందే. రోజంతా అభిమానులు, ప్రముఖులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
దహనం చేయవద్దని కోరిక
మంగళవారం నివాసం నుంచి పూలతో అలంకరించిన వాహనంలో పార్థివ దేహాన్ని దశవార గ్రామానికి ఊరేగింపుగా తరలించారు. ఒక్కలిగుల సంప్రదాయరీతిలో అంతిమ సంస్కారాలను జరిపారు. పార్థివ శరీరాన్ని కాల్చడం లేదా పూడ్చిపెట్టడం రెండు విధానాలు ఉన్నప్పటికీ, సరోజాదేవి తన దేహాన్ని కాల్చవద్దని, పూడ్చిపెట్టాలని జీవించి ఉన్నప్పుడు బంధువులకు సూచించింది. ఆ మేరకు రాజ లాంఛనాలతో ఆమె తల్లి రుద్రమ్మ సమాధి పక్కనే ఖననం చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
స్వగ్రామంలో మాతృమూర్తి సమాధి పక్కనే ఖననం
అలనాటి అందాల నటికి అధికార లాంఛనాలతో వీడ్కోలు
సొంతూరు అంటే మక్కువ
సరోజాదేవి తరచూ విశ్రాంతి కోసం స్వగ్రామం వచ్చి కొన్ని రోజులు గడిపి వెళ్లేది. ఆమె గ్రామంలో పాఠశాలలు నిర్మించారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కష్టం అని వచ్చిన వారికి తోచినంత సాయం చేసేదని గ్రామస్తులు తెలిపారు.

నేల తల్లి ఒడికి సరోజమ్మ

నేల తల్లి ఒడికి సరోజమ్మ

నేల తల్లి ఒడికి సరోజమ్మ

నేల తల్లి ఒడికి సరోజమ్మ