
నటనలో చెరగని ముద్ర
● బైరప్ప, రుద్రమ్మ దంపతులకు సరోజాదేవి జన్మించారు. తండ్రి పోలీస్‌గా పనిచేసేవారు.
● 17వ ఏటనే సినీరంగంలోకి అడుగుపెట్టి దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించారు.
● కన్నడ వరనటుడు డాక్టర్ రాజ్‌కుమార్, కళ్యాణ్‌కుమార్, ఉదయ్‌కుమార్‌తో సరోజాదేవి నటించారు. ఇక హిందీలో దిలీప్‌కుమార్, రాజేంద్రకుమార్, షమ్మీకపూర్, సునీల్‌దత్ వంటి అగ్రనటులతో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
● కిత్తూరు రాణిచెన్నమ్మ, భక్త కనకదాస, బాళే బంగార, నాగకన్య, బెట్టదపూవు, కస్తూరి నివాస, బబ్రువాహన, కథాసంగమ, అమరశిల్పి జక్కణాచారి, మల్లమ్మన పవాడ తదితర వందలాది కన్నడ సినిమాల్లో నటించి శాండల్‌వుడ్ ధృవతారగా వెలుగొందారామె.
● కిత్తూరు రాణి చెన్నమ్మ సినిమాలో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించారు.
● ఆమె పాత్రలన్నీ ఎంతో ఉన్నతస్థాయి విలువలతో మహిళల గౌరవాన్ని పెంచేవిగా ఉంటాయి.
● 2019లో పవర్‌స్టార్ పునీత్‌రాజ్ కుమార్ హీరోగా రూపొందిన నటసార్వభౌమ సినిమాలో సరోజాదేవి నటించారు. ఇదే ఆమె చివరి సినిమా.
● కర్ణాటక ప్రభుత్వ రాజ్యోత్సవంతో పాటు అందుకున్న పురస్కారాలకు లెక్కేలేదు.