
బకాయిలు చెల్లించాలని ధర్నా
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో బకాయి ఉన్న మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరగే)లో పనులు చేసిన కూలీలకు పనుల డబ్బులు చెల్లించాలని భారతీయ దళిత సేన సమితి డిమాండ్ చేసింది. సోమవారం జెడ్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ధర్మనగౌడ మాట్లాడారు. ఆరు నెలల నుంచి వ్యవసాయ కూలీలతో నరేగ పనులు చేయించుకొని అధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి వేతనాలు అందించక పోవడం తగదన్నారు. తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
సమాజ సేవకులకు
గుర్తింపు అవసరం
రాయచూరు రూరల్: సమాజంలో వివిధ రంగాల్లో సేవలందించిన సేవకులకు గుర్తింపు అవసరమని మాజీ విధాన పరిషత్ సభ్యుడు శంకరప్ప పేర్కొన్నారు. సోమవారం దేవదుర్గ మాజీ శాసన సభ్యుడు శివనగౌడ నాయక్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో మంచి పనులు చేసిన వారిని మరిచి పోకుండా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ హవల్దార్, గంగాధర నాయక్, ఈరన్న, శరణప్ప గౌడలున్నారు.
డెంగీ కట్టడికి జన జాగృతి
రాయచూరు రూరల్: జిల్లాలో డెంగీ వ్యాధి నియంత్రణకు జన జాగృతి అవసరమని జిల్లా ఆరోగ్య శాఖాధికారి సురేంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం ఆజాద్‌నగరలో ఇంటింటికెళ్లి మాట్లాడారు. నగరంలో నీటి నిల్వలు, మురుగు కాలువల వద్ద శుభ్రతను పాటించాలన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రతను పాటించాలన్నారు.
ఇకపై హెల్మెట్ ధారణ తప్పనిసరి
రాయచూరు రూరల్: జిల్లాలో ద్విచక్ర వాహన చోదకులు మంగళవారం నుంచి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని రాయచూరు జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య ఆదేశించారు. సోమవారం పత్రికలకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన పైమేరకు పేర్కొన్నారు. ఎండా కాలంలో నాలుగు నెలల పాటు ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో పెద్దగా పట్టించుకోలేదన్నారు. వానా కాలంలో రహదారులపై నీరు నిలిచి జారీ పడే అవకాశాలు మెండుగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ హెల్మెట్లను ధరించి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. హెల్మెట్‌లను ధరించకుంటే రూ.500 జరిమానా చెల్లించక తప్పదన్నారు.
గుండెపోటుతో
ఎమ్మెల్యే పీఏ మృతి
రాయచూరు రూరల్: కుష్టిగి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు గుండెపోటుతో మరణించిన ఘటన కొప్పళ జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం కుష్టిగి ఎమ్మెల్యే దొడ్డనగౌడ వద్ద 20 ఏళ్ల పాటు పర్సనల్ అసిస్టెంట్(పీఏ)గా విధులు నిర్వహిస్తున్న చంద్రకాంత్ (46)తన నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు.
సంస్కృతి, సంప్రదాయాల్ని పరిరక్షించుకోవాలి
బళ్లారిఅర్బన్: కర్ణాటక సాహిత్య, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకొని అభివృద్ధి చేసే దిశలో గ్రామీణ ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నాటక రంగ సీనియర్ కళాకారిణి బీ.వీణాకుమారి అన్నారు. కంప్లి తాలూకా రామసాగర పాఠశాలలో ఏర్పాటు చేసిన మూడవ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంత చిన్నారులు తమలోని ప్రతిభ పాటవాలను వెలికి తీయాలన్నారు. రామసాగర జీపీ చైర్‌పర్సన్ ఎం.ఆశా మాట్లాడుతూ రామసాగరలో అనేక జానపద కళాకారులు, విద్వాంసులు ఉన్నారన్నారు. వారు కర్ణాటకకు అనన్యమైన సేవలు అందించారన్నారు. కన్నడ సంస్కృతి శాఖ జిల్లా ఏడీ నాగరాజ్ మాట్లాడుతూ బళ్లారి కళాకారులకు పుట్టినిల్లు అని అన్నారు. కళాకారుడు మోహన్ కలబుర్గి వయోలిన్ వాదన, కే.దొడ్డబసప్ప గవాయి బృందంచే సుగమ సంగీతం, వనమాల కులకర్ణి బృందం సామూహిక నృత్యాలు, యల్లనగౌడ శంకర్‌బండే బృందం జానపద గీతాలు, ఏళుబెంచి సీఎం కరుణామూర్తి కథాకీర్తన, వరలక్ష్మీ బృందంచే హేమరెడ్డి మల్లమ్మ నాటకం ప్రదర్శించారు.

బకాయిలు చెల్లించాలని ధర్నా

బకాయిలు చెల్లించాలని ధర్నా

బకాయిలు చెల్లించాలని ధర్నా