
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో చర్చిద్దామా?
హుబ్లీ: బీజేపీ ఎవరి గురించి అయినా విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు. ఇతరులు బీజేపీ వారిని ప్రశ్నిస్తే సహించుకోలేక సంకటాన్ని సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి సంతోష్‌లాడ్ తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ 193 దేశాలకు గాను 183 దేశాలు పాక్‌కు అనుకూలంగా ఓట్లు వేశాయి. ఈ విషయాన్ని ప్రశ్నించాలా వద్దా? అని ఆయన నిలదీశారు. అధికారంలోకి రావడానికి ముందు ప్రధాని మోదీ బీజేపీ ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు. వాటి అమలు గురించి ప్రశ్నించాలా, వద్దా? అంటూ మండిపడ్డారు. విదేశీ పర్యటనకు వెళ్లే ప్రధాని మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులను తీసుకెళ్లకుండా కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. ఇది సమంజసమా? బీజేపీ నేతలు శశిథరూరు ఎందుకు కావాలి. బీజేపీలో ఇంగ్లిష్‌లో మాట్లాడే సామర్థ్యం లేకపోవడంతోనే శశిథరూరును వాడుకుంటున్నారన్నారు. 11 ఏళ్ల మోదీ పాలన కర్మకాండ గురించి ప్రశ్నించరాదా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌లో కొన్ని విబేధాలు ఉన్నాయి. వాటిని పెద్దగా రాద్ధాంతం చేయడం బీజేపీకి అలవాటు అని అన్నారు. అయితే వారిలో అసమ్మతి గ్రూపిజం బహిరంగ ప్రకటనలు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించలేని స్థితి గురించి బీజేపీ నేతలు మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రి సంతోష్ లాడ్ సవాల్