
మైసూరులో లోక్ అదాలత్
మైసూరు: కేసులను రాజీ ద్వారా పరిష్కరించేందుకునే జాతీయ లోక్ అదాలత్‌ను ఏర్పాటు చేశారు. మైసూరు నగరం, తాలూకాలోని కోర్టులలో మొత్తం 1,27,153 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 61,193 సివిల్ కేసులు, 60,932 క్రిమినల్ కేసులు ఉన్నాయని, వీటిలో అదాలత్‌లో 39,640 పరిష్కరించగల కేసులున్నాని కోర్టు అధికారులు తెలిపారు. వాటిలో 22,161 కేసుల మీద చర్చించారు. మైసూరు, తాలూకా కోర్టులలో గొడవలతో విడాకుల కోసం ఆశ్రయించిన మొత్తం 44 జంటలు రాజీపడి మళ్లీ కలిసిపోయారు. జిల్లా జడ్జి ఉషారాణి, జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.