
నగరాభివృద్ధికి కనీస చర్యలు చేపట్టాలి
● మౌలిక సదుపాయాల కల్పన అవసరం
● పాలికె ప్రతిపక్ష నాయకుడు ఇబ్రహీంబాబు
సాక్షి,బళ్లారి: నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి కనీస చర్యలు చేపట్టాలని మాజీ మేయర్, ప్రస్తుత బళ్లారి మహానగర పాలికె ప్రతిపక్ష నాయకుడు ఇబ్రహీంబాబు సూచించారు. పౌరుల భాగస్వామ్యం, సామూహిక నాయకత్వం ద్వారా నగరాభివృద్ధి ఎలా సాధించాలన్న అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. పెరుగుతున్న నగరాలు, నగర నాయకులు శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలోని ఇండియా హాబిట్యాక్ సెంటర్‌లో ప్రజాగ్రహ సంబంధిత సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరాల అభివృద్ధితో పాటు భారత్ అభివృద్ధి పథంలో సాగేందుకు దేశ బంగారు భవితను రూపొందించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారన్నారు. సమావేశంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికై న 30 మందికి పైగా నగర నాయకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అధ్యక్షులు, మేయర్లు పాల్గొనడం హర్షణీయమన్నారు.