
జీవితాన్ని తీర్చిదిద్దేది గురువులే
● మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి
సాక్షి,బళ్లారి: ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేది గురువులేనని, అలాంటి గురువులను మరువకుండా జీవితాంతం గుర్తుకు పెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం పరమ పవిత్రమైన గురుపౌర్ణమి సందర్భంగా తనకు విద్యను బోధించిన గురువుల చెంతకు వెళ్లి వారికి పాదాభివందనం చేసి, తన గురు భక్తిని చాటుకున్నారు. నగరంలో తనకు విద్యను నేర్పించిన మూలా శ్రీనివాస్, రామచంద్రప్ప, కాండ్ర శ్రీరాములు, సరళ తదితరులను కలిసి, వారిని శాలువాతో సన్మానించి, పూలమాలలు వేసి పాదాభివందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కండక్టర్ నుంచి కలెక్టర్ వరకు దేశంలో అత్యున్నత పదవులను అలంకరించిన వారికి కూడా గురువులు ఉంటారన్నారు. జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే జీవితాన్ని ఇచ్చేది గురువులేనన్నారు. అనంతరం ఆయన షిర్డీసాయి బాబా ఆలయాల్లో కుటుంబ సమేతంగా పూజలు చేశారు.

జీవితాన్ని తీర్చిదిద్దేది గురువులే