
బాలికపై లైంగికదాడి, హత్య
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలో దారుణం సంభవించింది. రామనగర జిల్లా తావరెకెరెలో బాలిక మీద ఓ దుండగుడు అత్యాచారం చేసి ప్రాణాలు తీశాడు. వివరాలు.. కొప్పళ నుంచి పొట్టకూటి కోసం వచ్చిన కుటుంబం తావరెకెరెలో నివసిస్తోంది. బుధవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో బాలిక (14) ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు యల్లప్ప ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్నాడు. తరువాత గ్యాస్ సిలిండర్‌తో కొట్టి బాలికను హత్య చేసి పరారయ్యాడు. సిలిండర్‌ను తీసికెళ్లి పక్క గ్రామంలో విక్రయించాడు. యల్లప్ప రాయచూరు నుంచి జీవనోపాధికై ఇక్కడకు వచ్చాడు. గార పని చేస్తూ తరచూ హతురాలి ఇంటికి వచ్చి తల్లిదండ్రులను పలకరించేవాడు. అదే సమయంలో బాలికపై కన్నేసి ఘోరానికి ఒడిగట్టాడు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక ఘోరం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా దుండగుడు బైక్‌పై రావడం, వెళ్లడం కనిపించింది. యల్లప్పను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
తావరకెరెలో ఘోరం
నిందితుడు వలస కూలీ