ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు షురూ
రాయచూరు రూరల్: నగరంలో జరగనున్న ముంగారు సాంస్కృతిక ఉత్సవాలకు రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు శ్రీకారం చుట్టారు. ఆదివారం రాత్రి ఈశ్వర ఆలయం వద్ద మున్నూరు కాపు సమాజం చేపట్టిన నృత్యం, వివిధ కళాకారులతో నృత్యప్రదర్శనలు జరిగాయి. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, ముంబైల నుంచి వచ్చిన కళాబృందాలు ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, నరసారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శేఖర్‌రెడ్డి, అమరేష్, చంద్రశేఖర్, శివ బసప్ప మాలిపాటిల్, కృష్ణమూర్తిలున్నారు.
డోలు వాయించి ప్రారంభించిన మంత్రి ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు


