పౌర కార్మికుల నిరసన.. పేరుకున్న చెత్త | - | Sakshi
Sakshi News home page

పౌర కార్మికుల నిరసన.. పేరుకున్న చెత్త

Jun 2 2025 1:53 AM | Updated on Jun 2 2025 1:53 AM

పౌర క

పౌర కార్మికుల నిరసన.. పేరుకున్న చెత్త

హొసపేటె: గత ఐదు రోజులుగా పౌర కార్మికులు తమ వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం విధులు బహిష్కరించి నిరసన తెలపడంతో నగరంలో అనేక రహదార్లు చెత్తకుప్పల్లా దర్శనం ఇస్తున్నాయి. దీంతో హొసపేటె నగరం మురికివాడగా మారుతోంది. హొసపేటె నగరం నుంచి హంపీకి ప్రతి రోజూ వేలాది మంది పర్యాటకులు వచ్చిపోతుంటారు. అయితే పౌర కార్మికులు నిరసన కారణంగా చెత్త సేకరించడం నిలిపి వేశారు. నగర ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేస్తున్నారు. దీంతో చెత్త దుర్వాసన వెదజల్లుతోంది. ప్రజలు వీధుల్లో తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు. పైగా ప్రజలు ఎక్కడ పడితే అక్కడ పడేసే చెత్త కుప్పలను పశువులు, కుక్కలు, పందులు చెల్లాచెదురు చేస్తున్నాయి. చెత్త కుళ్లిపోయి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నగరసభ యంత్రాంగం వెంటనే రహదార్లలో ఉన్న చెత్తను తొలగించే దిశగా దృష్టి పెట్టాలని నగర ప్రజలు విజ్ఞప్తి చేశారు.

పౌర కార్మికుల నిరసన.. పేరుకున్న చెత్త 1
1/1

పౌర కార్మికుల నిరసన.. పేరుకున్న చెత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement