
బాలింత మృతిపై గొడవ
రాయచూరు రూరల్: ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన సోమవారం జిల్లాలో చోటు చేసుకుంది. మస్కిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో సిద్దమ్మ (23) అనే గర్భిణి కాన్పు కోసం చేరింది. ఆమెకు శిశువు జన్మించింది, గైనకాలజిస్టు డాక్టర్ సౌమ్య గుండళ్లి ఆదివారం రాత్రి బాలింత సిద్దమ్మకు సరైన సమయంలో వైద్యసేవలు అందించక పోవడం వల్లే ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అంబులెన్సును ధ్వంసం చేశారు. ఇంతలో మస్కి ఎస్‌ఐ సిబ్బందితో వచ్చి వారిని అడ్డుకున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రికి వచ్చి పరిశీలించారు.

బాలింత మృతిపై గొడవ