
వరదల్లో చిక్కిన టూరిస్టులు
యశవంతపుర: ప్రకృతి అందాలను వీక్షిద్దామని వెళ్లిన పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు. దక్షిణ కన్నడ జిల్లాలో వర్షాల వల్ల రెడ్ అలర్ట్‌ను ప్రకటించారు. నదీ తీరం, జలపాతాలు, సముద్రం వద్దకు వెళ్లవద్దని జిల్లా అధికారులు తెలిపారు. కానీ కొందరు పర్యటకులు పుత్తిగె వద్దనున్న ఎరగుండి జలపాతాన్ని చూడడానికి వెళ్లి అపాయంలో ఇరుక్కున్నారు. స్థానికుల మాటలను నిర్లక్ష్యం చేసి వెళ్లిన ఐదు మంది.. వరదనీటి ప్రవాహం ఎక్కువ కావడంతో బండరాళ్ల మీద కూర్చుని కాపాడాలని కేకలు వేశారు. స్థానికులు అతికష్టం మీద తాళ్ల ద్వారా రక్షించారు. వర్షాలు తగ్గేవరకు పర్యాటకులు క్లిష్టమైన ప్రాంతాలకు వెళ్లరాదని అధికారులు సూచించారు.
బస్సు ప్రమాదం
ప్రైవేట్ బస్సు పల్టీ పడిన ఘటన జిల్లాలో బంట్వాళ వద్ద జరిగింది. జాతీయ రహదారి– 75లో కల్లడ్క సమీపంలోని కుద్రెబెట్టులో బస్సు రోడ్డు పక్కన పల్టీ పడగా ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. పుత్తూరు నుంచి మంగళూరుకు వెళ్లతున్న ప్రైవేట్ బస్సు బ్రేక్ ఫెయిల్ వల్ల బోల్తా పడింది.