
ఇప్పటికై నా పాక్ బుద్ధి తెచ్చుకోవాలి
హుబ్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి అన్నారు. నగరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద నిర్మూలనకు భారత ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చిందన్నారు.గతంలో దేశంలో పహల్గాం ఘటనకు మించి పెద్ద స్థాయిలో ఉగ్రవాద కార్యకలాపాలు జరిగాయన్నారు. వీటికి ప్రతికారం తీర్చుకున్నామన్నారు. పాక్ మీడియా ప్రకారం భారత్ జరిపిన దాడుల్లో మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న ఉగ్రవాదులు హతమయ్యారన్నారు. ఇక ముందు ఉగ్రవాదం జరిగితే దాన్ని యుద్ధంగా జరిగణిస్తామన్నారు. పాక్ ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. భారతీయులు శాంతి ప్రియులు అని, అయితే పాక్ ఉగ్రదాడులను ఏమాత్రం సహించేది లేదన్నారు. భారత్‌కు తనదైన సత్తా ఉందని, ఇంతకు ముందు దీని కన్న పెద్ద స్థాయిలో ఉగ్రవాదం జరిగినా సైన్యం తిప్పి కొట్టిందన్నారు. పాక్‌కు చెందిన 9కి పైగా లాంచింగ్ ప్యాడ్స్‌ను భారత సైన్యం ధ్వంసం చేసిందన్నారు. సంతోషం, విమర్శలు చేసేవారి గుర్తించి మాట్లాడను. మోదీ వచ్చాకే దేశంలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టి సరిహద్దులకు పరిమితమైందన్నారు. పాక్ డిజీఎం నేరుగా భారత్‌తో మాట్లాడారన్న నివేదిక వచ్చిందన్నారు. తర్వాత పరిణామాలను సంబంధించిన వారు వివరిస్తారన్నారు. అమెరికా అధ్యక్షుడి మధ్య వర్తిత్వంపై నేనేమి స్పందించనన్నారు. దేశ విదేశాంగ మంత్రి ఈ విషయంలో స్పస్టీకరణ ఇస్తారన్నారు.
ఉగ్రవాదుల పీచమణిచే సత్తా
భారత సైన్యానికి ఉంది
కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి