అంగరంగ వైభవం.. అణ్ణమ్మ దేవి ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవం.. అణ్ణమ్మ దేవి ఉత్సవం

May 12 2025 12:58 AM | Updated on May 12 2025 12:58 AM

అంగరం

అంగరంగ వైభవం.. అణ్ణమ్మ దేవి ఉత్సవం

బొమ్మనహళ్లి: బెంగళూరు దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఉన్న దొడ్డకమ్మనహళ్ళి గ్రామంలో ఆదివారం బెంగళూరు నగరదేవత అణ్ణమ్మ దేవి ఉత్సవం, గ్రామదేతల జాతర వైభవోపేతంగా జరిగింది. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో మల్లెలు, కనకాంబరాలతో అలంకరించి దీపాల హారతులను తీసుకుని వచ్చి గ్రామదేవతలకు సమర్పించారు. అణ్ణమ్మదేవి, కమ్మనహళ్ళి గంగమ్మదేవి, బండి మహాంకాళి దేవితో పాటు ఇతర గ్రామ దేవతలకు విశేష పూజలు చేసి పూల పల్లకీలలో ఊరేగింపు జరిపించారు.

దీపహారతులకు బహుమతులు

సుందరంగా దీపహారతులను తీర్చిదిద్దిన ముగ్గురు మహిళలకు బహుమానాలను అందజేశారు. ఏనుగు అంబారీపైన అమ్మవారు ఉన్నట్లు దీపహారతి చేసి న కావ్య రాజన్నకు మొదటి బహుమానంగా స్కూటీని, మహాలక్ష్మికి రెండవ బహుమతిగా ఫ్రిజ్‌ని, సుస్మితకు మూడవ బహుమతిగా వాషింగ్‌ మిషన్‌ను బహుమానంగా బహూకరించారు.

అంగరంగ వైభవం.. అణ్ణమ్మ దేవి ఉత్సవం1
1/2

అంగరంగ వైభవం.. అణ్ణమ్మ దేవి ఉత్సవం

అంగరంగ వైభవం.. అణ్ణమ్మ దేవి ఉత్సవం2
2/2

అంగరంగ వైభవం.. అణ్ణమ్మ దేవి ఉత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement